తమిళనాడులోని తిరునెల్వేలిలో రెండు ఆవుల మధ్య ఘర్షణ ఓ వ్యక్తి మృతికి దారితీసింది. రోడ్డుకి ఇరువైపులా వాహనాలు తిరుగుతున్నాయి. ఎదురుగా బస్సు వస్తుండగా, ఒక బైక్ అటు ఇటు వెళ్తోంది. అదే సమయంలో రెండు ఆవులు ఘర్షణ పడుతున్నాయి. ఒక్కసారిగా ఒక ఆవు మరో ఆవును కుమ్మేసింది. దీంతో ఆ ఆవు బైక్ రైడర్‌ను ఢీకొట్టింది. దాంతో బైక్ రైడర్ కిందపడిపోయాడు.. అంతలోనే అటుగా వచ్చిన బస్సు చక్రాలు అతనిపై నుంచి దూసుకెళ్లాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఈ సంఘటన జరిగింది. మేజిస్ట్రేట్ కోర్టులో పనిచేసే 58 ఏళ్ల వేలాయుధరాజ్ శనివారం ఉదయం బైక్‌పై విధులకు బయలుదేరాడు.
తమిళనాడులోని ఒక ప్రాంతంలో రోడ్డు పక్కగా రెండు ఆవులు కోట్లాడుకున్నాయి. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న వేలాయుధరాజ్‌ను ఒక ఆవు కుమ్మేసింది. దీంతో అతడు ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఇంతలో వేగంగా వస్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు అతడి పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్న అతడి వద్దకు బస్సు డ్రైవర్, స్థానికులు పరుగెత్తుకు వచ్చారు.. వేలాయుధరాజ్ మరణానికి కారణమైన ఆవు అనంతరం రోడ్డు దాటి వెళ్లిపోయింది.
As a two-wheeler rider, who was hit by the fighting stray cattle, fell under a TNSTC bus and died on the spot on Saturday, the Tirunelveli corporation officials initiated a special drive to impound the stray cattle across the corporation limit on Sunday. pic.twitter.com/E5cyhXGbPV
— Thinakaran Rajamani (@thinak_) June 23, 2024
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వేలాయుధరాజ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..