హైదరాబాద్‌కు చెందిన ఓ యూట్యూబర్ తమిళనాడు రాజధాని చైన్నై రోడ్లపై స్నేహితులతో కలిసి ప్రమాదకర స్టంట్లు చేశాడు.. ఆ తర్వాత కొందరి ఫిర్యాదుతో సీన్ రివర్స్ అయింది. అందరినీ అరెస్టు చేసి పోలీసులు జైలుకు తరలించారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన యువకుడితో పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు భద్రతా చర్యలు పాటించాలని అందరికీ తెలియజెసేలా అతను స్టంట్లు చేసిన ప్రాంతంలోనే అతనితో కరపత్రాలు, ప్లకార్డులు పట్టించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది. బైక్ పై ప్రమాదకర స్టంట్లు చేస్తూ పట్టుబడిన కోట్లా అలెక్స్ బినోయ్ అనే యూట్యూబర్ రోడ్లపై కరపత్రాలు పంచుతూ కనిపించాడు. ఇతను ఆగస్టులో చైన్నై సిటీ రోడ్లపై నిర్వహించిన బైక్ స్టంట్‌ల కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కోట్లా అలెక్స్ బినోయ్, అతని స్నేహితులు డీఎంకే కార్యాలయం ఎదురుగా ఉన్న తేనాంపేట్ రోడ్డులో ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసారు. ఆ తర్వాత ఈ వీడియోలను యూట్యూబ్‌లో పెట్టాడు. ఇది చూసిన కొందరు వీడియోలను షేర్ చేస్తూ చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు ముందుగా అతని బృందాన్ని పట్టుకున్నారు. అసలు దీనికి కారణమైన కోట్ల అలెక్స్ బినోయ్ పరారయ్యాడు. అనంతరం హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని పట్టుకుని జైలుకు తరలించారు.
ఈ కేసులో బెయిల్ పొందిన అనంతరం కోట్ల అలెక్స్ బినాయ్‌కు పోలీసులు సామాజిక బాధ్యత తెలిసొచ్చేలా పలు కార్యక్రమాలను రూపొందించారు. దీనిలో భాగంగా సోమవారం తేనాంపేట సిగ్నల్ వద్ద రోడ్డు భద్రత కరపత్రాలను పంచేలా చేశారు. అదేవిధంగా ప్రధాన సిగ్నల్ దగ్గర రోడ్డు భద్రతపై ప్లకార్డు పట్టుకుని కనిపించాడు.
వీడియో చూడండి..
As per reports, this happened yesterday at Anna Salai… Hope @chennaipolice_ will identify them soon and take appropriate action. pic.twitter.com/NHV0jx997W
— Janardhan Koushik (@koushiktweets) September 9, 2022
కాగా.. గత కొన్ని రోజుల నుంచి చెన్నై నగరంలో కొందరు పోకిరిలు ప్రమాదకర స్టంట్లు చేస్తూ.. ప్రయాణికులను భయభ్రాంతులకు చేస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..