మ్యాన్ ఈటర్ భయంతో హడలెత్తిపోయిన ప్రజలు హమ్మయ్యా అనుకుంటున్నారు. చిరుతపులి మరణవార్త విని స్థానికులు ఊపిరిపీల్చుకుంటున్నారు. నరమాంస భక్షక చిరుతపులి తుపాకీతో కాల్చి చంపబడింది. ఉత్తరాఖండ్‌లోని మైకోట్ గ్రామంలోని అడవిలో అటవీ శాఖకు చెందిన ఇద్దరు వేటగాళ్లు మాన్-ఈటర్ చిరుతపులిని చంపేసినట్టుగా అధికారులు వెల్లడించారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మైకోట్ గ్రామంలోని అడవిలో అటవీ శాఖకు చెందిన ఇద్దరు వేటగాళ్లు జై హుకిల్, గంభీర్ సింగ్ భండారీలు మ్యాన్ ఈటర్ చిరుతను కాల్చి చంపినట్లు ఉత్తరాఖండ్ అటవీ శాఖ స్థానిక డీఎఫ్‌వో వీకే సింగ్ తెలిపారు.
అలాగే నవంబర్ 27న అర్నాబ్ చంద్ అనే 12 ఏళ్ల బాలుడు ఇంటికి తిరిగి వస్తుండగా చిరుతపులి దాడి చేసి చంపేసిందని తెలిపారు. ఆ తర్వాత స్థానిక గ్రామస్తుల్లో భయాందోళనలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను నరమాంస భక్షకుడిగా ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి