AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రేయ్ పాముతో అవేం పనులురా.. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలిస్తే.. ఫ్యూజులు ఎగరాల్సిందే

మధ్యప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. పాములు పట్టే ఒక వ్యక్తి పాముతో పాటు అహ్మదాబాద్–సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులోకి ఎక్కి.. పాముతో ప్రయాణికులను భయపెడుతూ వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు దీన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch Video: రేయ్ పాముతో అవేం పనులురా.. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలిస్తే.. ఫ్యూజులు ఎగరాల్సిందే
Snake Viral Video
Anand T
|

Updated on: Sep 25, 2025 | 12:57 PM

Share

సాధారణంగా దొంగలు కత్తులు, గన్స్‌ చూపించి బెదిరించి దొంగతనానికి పాల్పడుతూ ఉంటారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం అందరికీ బిన్నంగా పాముతో రైల్వే ప్రయాణికులను భయపెట్టి వారి నుంచి డబ్బులు కాజేశాడు. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు దీన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్–సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన వెలుగు చూసింది. మధ్యప్రదేశ్‌లోని ముంగాలి, బినా జంక్షన్ల వద్ద ఒక పాములు పట్టే వ్యక్తి తన చేతితో పామును పట్టుకొని ట్రైన్‌లోకి ఎక్కాడు. ఆ తర్వాత తన చేతిలో ఉన్న పామును చూపిస్తూ ప్రయాణికులను డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. పామును చూసి భయపడిపోయిన ప్రయాణికులు వెంటనే తమ పర్సుల్లోంచి డబ్బులు తీసి అతనికి ఇచ్చేశారు. పక్కనే ఉన్న ఒక ప్రయాణికుడు ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. ఆ పోస్ట్‌లో అతను ఇలా రాసుకొచ్చాడు.. భారతీయ రైల్వేలో కష్టపడి పనిచేసే కార్మిక వర్గం నుంచి డబ్బులు వసూలు చేసేందుకు కొందరు వ్యక్తులు ఇలాంటి కొత్త మార్గాలను వెతుకుతున్నట్టు పేర్కొన్నాడు. అలాగే ఆ వీడియోను రైల్వే శాఖను ట్యాగ్ చేశాడు.

ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారి రైల్వేశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణ వివరాలను మొబైల్ నంబర్‌ను తమకు పంపించాలని కోరారు. మరోవైపు, ఈ వీడియో చూసిన నెటిజన్లు అ వ్యక్తి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్న వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..