Viral Video: వేట కత్తులతో వెంటాడి వ్యక్తి దారుణ హత్య.. సీసీ కెమెరాలో షాకింగ్‌ దృశ్యాలు..

దుండగుల దాడి నుంచి తప్పించుకునేందుకు అతడు ఓ బేకరిలోకి దూరాడు.. అయినా హంతకులు అతన్ని విడిచిపెట్టలేదు..బేకరిలోపల ఉన్న ఆ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కర్రలు, కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్యచేశారు. ఈ దాడి దృశ్యాలన్నీ బేకరీలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలలో రికార్డైంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. హత్యకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral Video: వేట కత్తులతో వెంటాడి వ్యక్తి దారుణ హత్య.. సీసీ కెమెరాలో షాకింగ్‌ దృశ్యాలు..
Man Brutally Murdered

Updated on: Jun 03, 2025 | 8:58 AM

ఒక వ్యక్తిని ఏడుగురు దుండగులు వేట కత్తులతో వెంటాడి దారుణంగా హత్య చేసిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దుండగుల దాడి నుంచి తప్పించుకునేందుకు అతడు ఓ బేకరిలోకి దూరాడు.. అయినా హంతకులు అతన్ని విడిచిపెట్టలేదు..బేకరిలోపల ఉన్న ఆ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కర్రలు, కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్యచేశారు. ఈ దాడి దృశ్యాలన్నీ బేకరీలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలలో రికార్డైంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. హత్యకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒక వ్యక్తిని ఏడుగురు దుండగులు వేట కత్తులతో వెంటాడి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలో చోటు చేసుకుంది. చెన్నప్ప నారినాల్ అనే వ్యక్తిని ఏడుగురు వ్యక్తులు చంపేందుకు వెంబడించారు. తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం అతడు రోడ్డుపై పరుగులు తీశాడు. చివరకు పక్కనే ఉన్న ఒక బేకరీలోకి వెళ్లాడు.. ఏడుగురిలోని ముగ్గురు వ్యక్తులు అతడిపై కర్రలతో దాడి చేశారు. కత్తితో పొడి చంపేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

కాగా, వీడియో వైరల్‌గా మారటంతో పోలీసులు రంగంలోకి దిగారు. హత్యలో పాల్గొన్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్టుగా తెలిసింది. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..