పెళ్ళొద్దు అన్నందుకు యువతీ పై దాడి ..!

|

Mar 03, 2020 | 1:33 PM

తమిళనాడు కోయంబత్తూరులో దారుణం జరిగింది. పెళ్లి వాయిదా వేస్తుందనే ఆగ్రహంతో ప్రియురాలినే చంపేశాడు ప్రియుడు. యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి..ఆమె నోట్లో బలవంతంగా విషం పోశాడు.

పెళ్ళొద్దు అన్నందుకు యువతీ పై దాడి ..!
Follow us on

తమిళనాడు కోయంబత్తూరులో దారుణం జరిగింది. పెళ్లి వాయిదా వేస్తుందనే ఆగ్రహంతో ప్రియురాలినే చంపేశాడు ప్రియుడు. యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి..ఆమె నోట్లో బలవంతంగా విషం పోశాడు. అంతటితో ఆగలేదు ఆ సైకో ప్రేమికుడు. చున్నీతో నోటిని గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

కోయంబత్తూరుకు చెందిన నందిని గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కాలేజ్‌లో డిగ్రీ చదువుతోంది. కళాశాలకు పక్కనే ఫ్యాన్సీ షాప్‌ నడుపుతున్నాడు దినేష్‌. రోజూ కాలేజ్‌కు వస్తున్న నందినిని ప్రేమ పేరుతో వేధించేవాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు..ఇద్దరికీ మ్యారేజ్‌ చేయాలని నిశ్చయించారు. ఐతే పెళ్లికి వాయిదాలు వేస్తున్నారనే కక్షతో ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు దినేష్‌. ఆమెను హత్య చేసిన అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. నందిని పేరెంట్స్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దినేష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.