మేకిన్ ఇండియా గురూ.. ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ల వర్షమే.. ఆర్మీ చేతికి ప్రళయ భీకర ప్రహార్..
పేరు ప్రహార్.. పని తీరు ప్రళయ భీకరం. సై అంటే సెకండ్‌కో హెడ్‌ని ఎగురగొట్టేస్తాయి. యుద్ధరంగంలో మన సైనికులు, ఈ LMGలతో విరుచుకుపడితే...శత్రుసేనలు కకావికలం కాక తప్పదు. గర్జించు ఇండియా, గాండ్రించు ఇండియా అంటూ మన సైన్యానికి అదాని డిఫెన్స్ అందజేసిన ఈ ప్రహార్ గన్నులు..కన్నులు చెదిరేలా ఉన్నాయి. శత్రమూకలు బెదిరేలా భయపెడుతున్నాయి. వీటి స్పెషాలిటీ ఏంటో చూద్దాం?

వెయిట్ చూస్తే..లైట్ వెయిట్. పేల్చి చూస్తే, ఫైట్ అదుర్స్. ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ దిగుద్ది. పాక్‌కి వెన్నులో వణుకు పుట్టేలా, చైనాకు చెవులు చిల్లులు పడేలా…మేకిన్ ఇండియా లైట్ మెషిన్‌గన్స్ గర్జిస్తున్నాయి. పేరు ప్రహార్.. పని తీరు ప్రళయ భీకరం. సై అంటే సెకండ్‌కో హెడ్‌ని ఎగురగొట్టేస్తాయి. యుద్ధరంగంలో మన సైనికులు, ఈ LMGలతో విరుచుకుపడితే…శత్రుసేనలు కకావికలం కాక తప్పదు. గర్జించు ఇండియా, గాండ్రించు ఇండియా అంటూ మన సైన్యానికి అదాని డిఫెన్స్ అందజేసిన ఈ ప్రహార్ గన్నులు..కన్నులు చెదిరేలా ఉన్నాయి. శత్రమూకలు బెదిరేలా భయపెడుతున్నాయి. వీటి స్పెషాలిటీ ఏంటో చూద్దాం?
మైండ్‌లో ఫిక్సయితే బ్లైండ్‌గా దూసుకుపోవడం కాదు. గన్నుకే కన్నుంటే, అది ఆలోచించి ఆటోమేటిక్‌గా శత్రువుని గుర్తించి, టార్గెట్ ఫిక్స్ చేసి పేల్చి పారేస్తే ఎలా ఉంటుంది? అచ్చం మన సైన్యానికి అందజేసిన ప్రహార్ లైట్ మెషిన్ గన్‌లా ఉంటుంది. యస్. ఇప్పుడు భారత్ ఆర్మీ చేతుల్లో ఈ గన్నులు గర్జిస్తున్నాయి. కొండల్లో కోనల్లో…ఎనీ టైమ్ ఎనీ ప్లేస్..శత్రువులకు రక్త చరిత్ర రుచి చూపించడానికి తహతహలాడుతున్నాయి. టెర్రరిస్టులు, పాక్, చైనా సేనల గుండెల్లో గుళ్లు కురిపించే దమ్మున్న ప్రహార్ లైట్ మెషిన్‌గన్స్ ఇవి.
ఆర్మీ అమ్ములపొదిలో సరికొత్త అస్త్రం
భారత అమ్ములపొదిలో సరికొత్త అస్త్రం చేరింది. పరాక్రమం చూపించమంటూ మన సైనికుల చేతికి ప్రహార్ మెషిన్ గన్ అందింది. అదానీ డిఫెన్స్ అందజేసిన మెషిన్ గన్‌లతో సైన్యానికి అదనపు బలం చేకూరినట్లయింది. దీంతో ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో రక్షణ రంగంలో భారత్ మరో భారీ ముందడుగు వేసింది. ప్రముఖ రక్షణ రంగ సంస్థ అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్…శనివారం నాడు భారత సైన్యానికి 2 వేల ప్రహార్ లైట్ మెషిన్ గన్‌ల తొలి బ్యాచ్‌ను విజయవంతంగా అందజేసింది. గ్వాలియర్ శివార్లలోని అదాని స్మాల్ ఆర్మ్స్ కాంప్లెక్స్‌లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ ఆయుధాల అందజేత కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖ డీజీ ఏ. అన్బరసు, అదానీ డిఫెన్స్ సీఈవో ఆశిష్ రాజ్‌వంశీ పాల్గొని, ఈ అత్యాధునిక ఆయుధాలను సైన్యానికి అధికారికంగా అప్పగించారు.
7.62MM కాలిబర్ సామర్థ్యం
ఈ ‘ప్రహార్’ మెషిన్ గన్‌లు 7.62 mm కాలిబర్ సామర్థ్యంతో, ఆధునిక యుద్ధ తంత్రాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. ఈ ఆయుధాలను ఒప్పందం ప్రకారం నిర్ణయించిన గడువు కంటే దాదాపు 11 నెలల ముందే పూర్తి చేయడం విశేషం. మొత్తం 41,000 ఎల్‌ఎమ్‌జీల తయారీకి ఆర్మీ ఆర్డర్ ఇస్తే, అందులో భాగంగానే ఈ తొలి విడతను అదాని డిఫెన్స్ అందజేసింది. రాబోయే మూడేళ్లలో పూర్తి ఆర్డర్‌ను అందజేస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. గ్వాలియర్‌లోని ఈ తయారీ కేంద్రం ఏటా లక్ష ఆయుధాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉండడం… రక్షణ రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతికి నిదర్శనం అంటున్నారు రక్షణరంగ నిపుణులు.
పెరగనున్న సైనికుల ఫైర్ పవర్
ఇక సరిహద్దుల్లో మోహరించిన భారత సైనికుల ఫైర్ పవర్‌ను పెంచడంలో ఈ ప్రహార్ గన్‌లు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ సహకారంతో.. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసుకుని, ‘నెగెవ్ NG7’ మోడల్ ఆధారంగా భారత్‌లో ఈ గన్‌లను తయారుచేశారు. రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెరగడం వల్ల తక్కువ సమయంలో నాణ్యమైన ఆయుధాలు సైన్యానికి అందుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. వీటి తయారీతో విదేశీ ఆయుధాల దిగుమతిపై ఆధారపడడం తగ్గుతుందని, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి మరింత బలం చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు.
ఓపెన్ బోల్ట్ మెకానిజంతో పనిచేసే గన్‌లు
ఈ ప్రహార్ లైట్ మెషిన్ గన్‌లు.. సైనికుల పోరాటపటిమను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఓపెన్ బోల్ట్ మెకానిజం ద్వారా పనిచేస్తుంది. దీని పిస్టన్ హెడ్‌లో ఉండే గ్యాస్ ప్రభావంతో రొటేటింగ్ బోల్ట్ పనిచేస్తుంది. ఈ ప్రహార్ గన్‌కు 508 MM బ్యారెల్ ఉంటుంది. దీని మొత్తం పొడవు వెయ్యి మిల్లిమీటర్లు ఉంటుంది. దీని హ్యాండిల్‌ని ముడిచేస్తే, పొడవు 820 MMకి తగ్గిపోతుంది. దీంతో పారాట్రూపర్లను ఈ గన్నులతో యుద్ధరంగంలో మోహరించడం సులువుగా మారుతుంది. బుల్లెట్ల మ్యాగజీన్ లేకుండానే ఈ గన్ బరువు సుమారుగా 8 కిలోలు ఉంటుంది. ఇదే కేటగిరీకి చెందిన ఇతర గన్‌లతో పోలిస్తే..దీని బరువు దాదాపు 40 శాతం తక్కువని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్‌లో సత్తా చాటిన ఈ గన్నులు.. ఇప్పుడు ఇండియాలో గర్జించనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
