
దేశవ్యాప్తంగా విడాకుల కేసులు పెరుగుతున్నాయి. గృహ హింస కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తోంది. ఈ తరుణంలో సరికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. వివాహ సమయంలో అబ్బాయిలకు డోప్ పరీక్షలు, వైద్య పరీక్షలను తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్లమెంటు మల్విందర్ సింగ్ కాంగ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం (మార్చి 27, 2026) లోక్ సభలో జీరో అవర్‌లో ఆయన ఈ డిమాండ్‌ను లేవనెత్తారు.
“ఈ రోజుల్లో మన సమాజంలో విడాకులు, గృహ హింస కేసులు పెరుగుతున్నాయి. ఒక కొత్త సంబంధం ఏర్పడినప్పుడు, అమ్మాయిని చాలా నిశితంగా పరిశీలిస్తారు, కానీ అబ్బాయిని అంతగా పరిశీలించరు,” అని మల్విందర్ సింగ్ అన్నారు. పెళ్లి సమయంలో ప్రజలు ఇలాంటి విషయాలను దాచిపెడతారని ఆయన అన్నారు. “పెళ్లి సమయంలో డోపింగ్ పరీక్షలు, వైద్య పరీక్షలను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాము,” అని ఆయన అన్నారు.
తన డిమాండ్‌కు సంబంధించి ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో మల్విందర్ సింగ్ కాంగ్ రాశారు, “లోక్‌సభలో, నిశ్శబ్దంగా బాధపడే ఈ దేశంలోని ప్రతి కుమార్తె, సోదరి, తల్లి తరపున మాట్లాడాను. విడాకుల కేసులు పెరుగుతున్నాయి, గృహ హింస కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తోంది. ఈ బాధ పంజాబ్‌కే పరిమితం కాదు; ఇది యావత్ భారతదేశం అంతటా కుటుంబాలను నాశనం చేస్తోంది.” అని పేర్కొన్నారు.
అంతేకాదు “మనం పెళ్లికూతురి చదువు, నడవడిక, నేపథ్యం గురించి క్షుణ్ణంగా విచారిస్తాము. కానీ పెళ్లికొడుకు విషయానికి వస్తే చూసీచూడనట్లు వ్యవహరిస్తాము. పెళ్లి తర్వాత మాదకద్రవ్యాలకు బానిస కావడం, తీవ్రమైన అనారోగ్యాలు, నేర ప్రవృత్తులు ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఈ ద్వంద్వ ప్రమాణాలకు వెంటనే ముగింపు పలకాలి!” అని మల్విందర్ సింగ్ కాంగ్ పిలుపునిచ్చారు.
“వివాహ ధృవీకరణ పత్రం జారీ చేయడానికి ముందు ప్రతి వరుడికి డోపింగ్ పరీక్ష, వైద్యుల ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని భారత ప్రభుత్వాన్ని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను. ఇది ఒక చిన్న సంస్కరణ. ఇది మన మహిళలకు, వివాహ పవిత్రతకు ఒక గొప్ప రక్షణ కవచంగా నిలుస్తుంది. ఇకపై మౌనంగా బాధపడబోము. విచ్ఛిన్నమైన కుటుంబాలను మేము ఇకపై భరించలేము,” అని మల్విందర్ సింగ్ కాంగ్ పేర్కొన్నారు.
Today in the Lok Sabha I raised my voice for every daughter, sister and mother of this nation who is suffering in silence.
Divorces are rising, domestic violence is shattering homes — and this pain is not limited to Punjab, it is tearing apart families across India.
We thoroughly… pic.twitter.com/NUro0LWUJl— Malvinder Singh Kang (@kang_malvinder) March 27, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..