వయనాడ్ వరదల్లో అత్యంత దారుణంగా దెబ్బతిన్న ఉళ్లు..చూరాల్‌మల, ముండక్కాయ్ గ్రామాలు. ఎగువన కొండల నుంచి రాత్రికి రాత్రి ఒక్కసారిగా వరద పోటెత్తింది. అప్పటికే ఎడతెగని వర్షాలకు బాగా నానిపోయిన కొండచరియలు కూడా విరిగిపడడ్డాయి. ఆ రాళ్లు, వరద, బురద అంతా కింద ఉన్న ఊళ్లను ముంచెత్తింది. ప్రస్తుతం చూరల్‌మలైలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఈ గ్రామానికి వందల అడుగుల ఎత్తులో ఉంది ముండక్కై గ్రామం. విలయంతో అక్కడికి చేరే దారులు, వంతెనలు నాశనమైపోయాయి. సహాయక బృందాలు అక్కడికి పూర్తి స్థాయిలోచేరితే తప్ప అక్కడ పరిస్థితిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. పాలక్కాడ్‌లో వరద ఉధృతికి ఓ వంతెన దెబ్బతింది. వంతెనలో కొంత భాగం వరద నీటిలో కూలిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..