ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తమ వాహనాల ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ప్యాసింజర్, వాణిజ్య శ్రేణిలోని అన్ని రకాల వాహనాలపై జనవరి నుంచి ధరలు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. కాగా ఏ వాహనం మీద ఎంతవరకు ధర పెంచుతున్నారో ఇంకా ప్రకటించలేదు. కాగా ప్రస్తుతం పెరిగిన ముడి వనరుల ధరల నేపథ్యంలో ఇలా ధరలు పెంచుతున్నామని తెలిపింది. అటు మహీంద్రా తయారు చేసే థార్, స్కార్పియో మోడళ్ళకు ఎక్కువగా గిరాకీ ఉంది. ముడి వనరుల ధరలు క్రమంగా పెరుగుతుండడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జనవరి 1 నుంచి తమ కార్లపై 3 శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు గతవారం ఫోర్డ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కూడా జనవరి నుంచి ధరలు పెంచుతున్నామని తెలిపింది. ఇక కారు మోడళ్ళను బట్టి ధర పెరుగుదల ఉంటుందని తెలిపింది.