మోదీ “జాతిపిత” అయితే మరి మహాత్ముడు? : గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ షాకింగ్ కామెంట్స్

| Edited By:

Sep 30, 2019 | 3:31 AM

ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని పిలవడంపై మహాత్మాగాంధీ మనవడు తుషార్‌ గాంధీ అభ్యంతరం వ్యక్త చేశారు. జార్జ్ వాషింగ్టన్ స్థానంలో ట్రంప్ తనను తాను నిలుపుకోడానికి ఒప్పుకుంటారా అని కూడా ప్రశ్నించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనెల 24న అమెరికాలోని హూస్టన్‌లో జరిగిన సభలో ముఖ్య అతిధిగా హాజరైన ట్రంప్ , భారత ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసల […]

మోదీ జాతిపిత అయితే మరి మహాత్ముడు?  :  గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ షాకింగ్ కామెంట్స్
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని పిలవడంపై మహాత్మాగాంధీ మనవడు తుషార్‌ గాంధీ అభ్యంతరం వ్యక్త చేశారు. జార్జ్ వాషింగ్టన్ స్థానంలో ట్రంప్ తనను తాను నిలుపుకోడానికి ఒప్పుకుంటారా అని కూడా ప్రశ్నించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనెల 24న అమెరికాలోని హూస్టన్‌లో జరిగిన సభలో ముఖ్య అతిధిగా హాజరైన ట్రంప్ , భారత ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసల జల్లు కురింపించిన విషయం తెలిసిందే. గతంలో భారత్ అనేక రకాలుగా వివాదాలు, ఉద్యమాలతో ఉండేదని, కానీ వాటన్నిని మోదీ మోసుకొచ్చారని అంటూ… బహుశా ఆయన భారత దేశానికి పితామహుడు కావచ్చు అంటూ ప్రశంసించారు.

మహాత్మా గాంధీని హతమార్చిన గాడ్సేను కీర్తించడంపై ఆయన మాట్లాడుతూ భవిష్యత్తే దానికి సమాధానం ఇస్తుందన్నారు. ద్వేషాన్ని, హింసను ఆరాధించేవారే గాడ్సేను పొగుడుతారని అలాంటి వారిపై తనకు ఎలాంటి శతృత్వం లేదన్నారు. గాంధీజీని ఆరాధించే హక్కు నాకు ఉన్నప్పుడు.. గాడ్సేను ఇష్టపడటం వారి హక్కుగా భావిస్తానని తుషార్ గాంధీ చెప్పారు. అదే విధంగా మహాత్మాగాంధీ 150 వ జయంతిని గొప్పగా జరుపుకోవాలని భావిస్తున్న కేంద్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ కోసం ప్రభుత్వం చేస్తున్నవి కేవలం ప్రతీకలు మాత్రమేనని విమర్శించారు. బాపుజీ ఆలోచనలు, భావజాలాన్ని పరిపాలనలో ప్రతిచోటా అన్వయించే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని వారు అమలు చేయడం లేదన్నారు. గాంధీజీని కరెన్సీ నోట్లమీద, స్వచ్ఛభారత్ పోస్టర్లకు కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్ముని భావజాలం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలకు ప్రేరణ ఇచ్చిందన్నారు తుషార్‌గాంధీ. ఉగ్రవాదం, అసహనం పెచ్చుమీరిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో గాంధీయ వాదం మాత్రమే సుస్థిరతను సాధించగలదని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకల సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి మోదీని ఫాదర్ ఆఫ్ ది నేషన్‌ అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత హోస్టన్‌లో అమెరికా అధ్యక్షడు ట్రంప్ ఏకంగా మోదీ సమక్షంలోనే ఈ విధంగా పిలిచారు. అయితే ఈ విషయంలో దేశంలో పెద్ద చర్చకు దారితీసింది. మరోవైపు కేంద్ర మంత్రి ఒకరు ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతించాలని లేకపోతే వారు అసలైన భారతీయులే కాదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.