Landslide in Maharashtra: మహారాష్ట్రలో పెను విషాదం.. కొండచరియలు విరిగిపడి 36 మంది దుర్మరణం

మహారాష్ట్రలోని రాయ్​గఢ్​ జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది.  మహద్ తలై గ్రామంలో కొండచరియలు విరిగి పడ్డ ఘటనలో 36 మంది మృతి....

Landslide in Maharashtra: మహారాష్ట్రలో పెను విషాదం.. కొండచరియలు విరిగిపడి 36 మంది దుర్మరణం
Maharashtra Landslide

Updated on: Jul 23, 2021 | 3:50 PM

మహారాష్ట్రలోని రాయ్​గఢ్​ జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది.  మహద్ తలై గ్రామంలో కొండచరియలు విరిగి పడ్డ ఘటనలో 36 మంది మృతిచెందారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వారిని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. మహారాష్ట్రలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడినట్లుగా జోరు వాన పడుతుంది. రాయ్‌గఢ్‌, రత్నగిరి, కొల్హాపూర్‌ సహా పలు జిల్లాల్లో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఎక్కడికక్కడ వరదలు పోటెత్తగా… మహద్ తలై గ్రామంలో గురువారం రాత్రి కొండ చరియలు విరిగిపడ్డాయి. పదుల సంఖ్యలో ప్రజలు చిక్కుకుని ఉంటారని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో… సహాయక చర్యలు చేపట్టడం ఆలస్యమవుతుంది

ఈ ఉదయం ఎన్​డీఆర్​ఎఫ్, కోస్ట్​ గార్డును అధికారులు రంగంలోకి దింపారు. ఆయా దళాల సిబ్బంది… ఇప్పటికే కొందరిని కాపాడారు. 36 మంది ( 32 మంది తలైలో, నలుగురు సఖర్ సుతార్ ప్రాంతంలో) మరణించారని కన్ఫామ్ చేశారు. మిగిలిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. అయితే… భారీగా వరద ప్రవాహం ఉండటం వల్ల సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. రోడ్లపై బురద, శిధిలాల కారణంగా రెస్క్యూ బృందాలు స్పాట్‌కు చేరడానికి ఇబ్బంది పడుతున్నాయి.

మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో ఈ రూట్‌లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబై-గోవా హైవేపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. అటు కొల్హాపూర్‌లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. భారీ వర్షాలకు ముంబై- బెంగళూరు హైవే ఓ చోట కుంగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.

Also Read:అప్పటివరకు ఆ గుర్రం బానే ఉంది.. మతాబులు పేల్చగానే చిర్రెత్తిపోయింది.. ఆపై వరుడికి చుక్కలు

 కరోనా బాధిత భర్త వీర్యం కోసం పిటిషన్ వేసిన మహిళ ఇంట విషాదం