Girl Suicide: విషాద ఘటన.. టీవీ చూస్తుంటే అమ్మ మందలించింది.. అమ్మాయి ఆత్మహత్య

కౌమార దశలో ఉన్న పిల్లలు, యువత చిన్న, చిన్న కారణాలకే జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్నారు. భవిష్యత్‌లో సాధించాల్సిన లక్ష్యాలను, బ్రతుకునిచ్చిన అమ్మనాన్నలను..

Girl Suicide: విషాద ఘటన.. టీవీ చూస్తుంటే అమ్మ మందలించింది.. అమ్మాయి ఆత్మహత్య

Updated on: Feb 15, 2021 | 9:24 AM

కౌమార దశలో ఉన్న పిల్లలు, యువత చిన్న, చిన్న కారణాలకే జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్నారు. భవిష్యత్‌లో సాధించాల్సిన లక్ష్యాలను, బ్రతుకునిచ్చిన అమ్మనాన్నలను మర్చిపోయి క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చదువుపై ఫోకస్ పెట్టకుండా ఎక్కువగా టీవీ చూస్తున్నావంటూ తల్లి తిట్టడంతో 15 సంవత్సరాల బాలిక ఆత్మహత్య చేసుకుంది.  జిల్లాలోని న్యూ తోట్లాడో పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో, బాలిక తల్లి చదువులపై దృష్టి పెట్టకుండా టీవీ ఎక్కువగా చూస్తున్నందుకు కుమార్తెను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక,  తన గదికి వెళ్లి లాక్ చేసుకుంది. ఆ తర్వాత తాడు ఉపయోగించి పైకప్పుకు ఆమె ఉరేసుకుంది. ఈ సంఘటన రాత్రి 8.30 గంటల సమయంలో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న డియోలపర్ పోలీసులు విచారణ ప్రారంభించారు.

Also Read:

ఘోర రోడ్డు ప్రమాదం.. 15మంది దుర్మరణం.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు

వాలంటైన్స్ డే: తమ కలలరాణి నిధి అగర్వాల్‌కు గుడి కట్టి, అభిమానుల పాలాభిషేకం.. షాక్‌కు గురైన నటి

 

Follow Us