సెల్ఫీలు వచ్చినప్పటి నుంచి ఆ పిచ్చి అందరిలోనూ పాతుకుపోయింది. సమయం, సందర్భం లేకుండా సెల్ఫీలు తీసుకునేందుకు అందరూ ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ లిస్ట్‌లో ప్రజా సేవకులకేమీ మినహాయింపు లేదు. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ మంత్రి తీసుకున్న సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో రోడ్లు, ఇళ్లు దెబ్బతిని.. వేలమంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో సంగ్లీ జిల్లాలో వరదలకు నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించేందుకు మంత్రి గిరిరాజ్ మహాజన్ వెళ్లారు. అక్కడ పడవపై ప్రయాణిస్తూ సెల్ఫీ వీడియోకు ఫోజులిచ్చారు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘‘దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఉంటుంది’’. ‘‘మీకు కచ్చితంగా బెస్ట్ సెల్ఫీ వీడియో అవార్డు వస్తుంది’’ అంటూ ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు.
सत्ताधाऱ्यांनी असंवेदनशीलतेचा कळस गाठलाय! 'त्या' लेकराच्या मृतदेहाचे चित्र आठवले तर मनाला चटका लागून डोळ्यात टचकन पाणी येतं. मंत्री महोदय @girishdmahajan मात्र सेल्फीत मग्न आहेत. लाज कशी वाटतं नाही? @CMOMaharashtra या असंवेदनशील वागण्याची दखल घेणार का?#maharashtrafloods pic.twitter.com/1tDxo91gJg
— Dhananjay Munde (@dhananjay_munde) August 9, 2019