Viral: మేం పెద్ద కలలు కనకూడదా..? ఏకంగా రూ.6 కోట్లు అప్పడిగిన అన్నదాత.. ఎందుకంటే..?

|

Jun 18, 2022 | 9:14 PM

యువరైతు కైలాస్ ప‌తంగే .. ఆరు కోట్ల రుణం ఇవ్వాల‌ని గోరేగావ్‌లోని ఓ బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ డ‌బ్బుతో హెలికాప్టర్ కొని, దాన్ని కిరాయికి నడుపుతానని యువరైతు ద‌ర‌ఖాస్తులో వివరించారు.

Viral: మేం పెద్ద కలలు కనకూడదా..? ఏకంగా రూ.6 కోట్లు అప్పడిగిన అన్నదాత.. ఎందుకంటే..?
Helicopter
Follow us on

Maharashtra farmer: నేటికాలంలో వ్యవసాయం భారంగా మారింది. పంటలకు గిట్టుబాటు ధరల్లేక, కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రాక రైతులు లబోదిబోమంటున్నారు. దీంతో కరువుకాటకాలు కూడా రైతులను మరింత కుంగదీస్తున్నాయి. ఈ క్రమంలో ఓ రైతు తనకు హెలికాప్టర్ కొనేందుకు రుణం ఇవ్వాలంటూ బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాడు. దీనికోసం రూ.6 కోట్ల రుణం ఇవ్వాలంటూ కోరాడు. ప్రస్తుతం ఈ రైతుకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని హింగోలిలో చోటుచేసుకుంది. హింగోలీలోని తక్టోడా గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువరైతు కైలాస్ ప‌తంగే .. ఆరు కోట్ల రుణం ఇవ్వాల‌ని గోరేగావ్‌లోని ఓ బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ డ‌బ్బుతో హెలికాప్టర్ కొని, దాన్ని కిరాయికి నడుపుతానని యువరైతు ద‌ర‌ఖాస్తులో వివరించారు. వ్యవసాయం భారంగా మారిందని.. దానికోసం ఖ‌ర్చు చేయలేకపోతున్నానని రైతు ఆవేద‌న వ్యక్తంచేశాడు.

ప‌తంగేకు రెండు ఎక‌రాల భూమి ఉంది. అయితే వ‌ర్షాలు స‌రిగా కురవక, కరువు కాటకాలతో వ్యవసాయం పెను భారంగా మారిందని పేర్కొన్నాడు. గ‌డిచిన రెండేళ్ల నుంచి సోయాబీన్‌ను పండించాన‌ని, కానీ ఆ పంట వ‌ల్ల లాభాలు లేవ‌ని, పంట బీమా నుంచి వ‌చ్చిన డ‌బ్బు కూడా పెట్టుబడి ఖర్చులకు స‌రిపోవడంలేద‌ని కైలాస్ పతంగే తెలిపాడు. ప్రస్తుత కాలంలో వ్యవసాయం భారంగా మార‌డం వ‌ల్లే హెలికాప్టర్ కొనాల‌నుకుంటున్నట్లు తెలిపాడు. మంచి జీవ‌నం కోసం దాన్ని అద్దెకు ఇవ్వాలనుకుంటున్నానని తెలిపాడు.

పెద్దవాళ్లకే పెద్ద క‌ల‌లు ఎందుకు ఉండాలి, రైతులు కూడా పెద్ద క‌ల‌లు క‌నాల‌ని చెప్పాడు. హెలికాప్టర్ కొనేందుకు 6.65 కోట్ల లోన్ కోసం ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నాన‌ని, మిగితా వ్యాపారాల్లో చాలా పోటీ ఉంద‌ని, అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నట్లు రైతు దరఖాస్తులో వివరించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..