Coronavirus: దేశంలో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గతంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. తాజాగా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక మహారాష్ట్రలో అయితే పాజిటివ్ కేసుల సంఖ్యకు అంతేలేకుండా పోతోంది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదు అవుతుండటంతో అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 34.5 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 5.6 లక్షలు దాటింది. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 51,751 కరోనా కేసులు నమోదు కాగా, 258 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34, 58,996కు చేరగా, మరణాల సంఖ్య 58,245కు చేరింది. అలాగే ముంబైలో సోమవారం 6,905 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 43 మంది మృతి చెందారు.
మరోవైపు గడిచిన 24 గంటల్లో 52,312 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 28,34,473కు చేరినట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,64,746 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.
కాగా, మహారాష్ట్రలో కేసులు సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం మరింత చర్యలు చేపడుతోంది. కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నెల 15 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కరోనా వైరస్ రెండో ఉద్ధృతితో పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ తీవ్ర స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాలను మూడు రాష్ట్రాలకు పంపింది. గత కొన్నిరోజులుగా మూడు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు.. ఆయా రాష్ట్రాల్లో వైరస్ కట్టడి కాకపోవడంలో వైఫల్యాలను గుర్తించాయి.
దేశంలో కరోనా కట్టడిలోకి రాకపోవడంతో వాటి తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ 50 జిల్లాలకు ప్రత్యేక బృందాలను పంపింది. క్షేత్ర స్థాయిలో పర్యటించిన కేంద్ర బృందాలు.. కొన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ నిర్ధారణ కేంద్రాలు లేకపోవడం, కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకోకపోవడం, ఆరోగ్య సిబ్బంది కొరత తదితర సమస్యలను గుర్తించాయి.
AP Corona: ఏపీలో మరోసారి వికృతరూపం దాల్చుతున్న కరోనా.. కొత్తగా 3,263 పాజిటివ్ కేసులు