Maharashtra: వివాదంలో సీఏం కుర్చీ.. ప్రతిపక్షాలకు కౌంటర్ గా మరో ఫోటో రిలీజ్ చేసిన షిండే వర్గం..

రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి.. ఇలా ఈ నలుగురు వ్యక్తులకు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నలుగురి వ్యక్తులకు సంబంధించిన స్థానాల్లో ఎవరు పడితే వారు కూర్చోవడానికి వీలుండదు. ఎవరైనా కాదని.. ఈ ప్రముఖుల కోసమే కేటాయించిన అధికారిక స్థానంలో..

Maharashtra: వివాదంలో సీఏం కుర్చీ.. ప్రతిపక్షాలకు కౌంటర్ గా మరో ఫోటో రిలీజ్ చేసిన షిండే వర్గం..
Maharashtra Cm Chair Contro
Follow us

|

Updated on: Sep 25, 2022 | 9:34 AM

Maharashtra: రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి.. ఇలా ఈ నలుగురు వ్యక్తులకు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నలుగురి వ్యక్తులకు సంబంధించిన స్థానాల్లో ఎవరు పడితే వారు కూర్చోవడానికి వీలుండదు. ఎవరైనా కాదని.. ఈ ప్రముఖుల కోసమే కేటాయించిన అధికారిక స్థానంలో సరదాకి కూడా ఎవరూ కూర్చున్నా అది ఆ స్థానాన్ని అవమానించినట్లే. ప్రస్తుతం మహారాష్ట్రలో సీఏం కుర్చీ వివాదంలో పడింది. ఈకుర్చీని అగౌరవ పరుస్తూ.. ఆహోదా లేని వ్యక్తులు సీఏం కుర్చీలో కూర్చున్నారన్న వార్తలు ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. మహారాష్ట్ర సీఏం ఏక్ నాథ్ షిండే తనయుడు, కళ్యాణ్ పార్లమెంటు సభ్యుడు శ్రీకాంత్ షిండే సీఏం కుర్చీలో కూర్చుని.. అధికారులతో మాట్లాడుతూ.. ఫైల్స్ చూస్తున్న సమయంలో తీసిన కొన్ని ఫోలోలు, వీడియోలు బయటకు రావడంతో అవి వైరల్ అయ్యాయి. సీఏం కుర్చీని అగౌరవపర్చారంటూ ప్రతిపక్ష పార్టీలు వీటిపై విమర్శలు గుప్పించాయి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకని శ్రీకాంత్ షిండే అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అయితే ప్రతిపక్షాల విమర్శలపై స్పందించారు ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే. ముఖ్యమంత్రి కోసం కేటాయించిన కుర్చీలో తాను ఎప్పుడూ కూర్చోలేదని స్పష్టం చేశారు.

థానేలోని తమ నివాసంలో తండ్రి ఏక్ నాథ్ షిండే కోసం ఏర్పాటుచేసిన కుర్చీలో తాను కూర్చుని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నానని, అంతేకాని సీఏం క్యాంపు కార్యాలయంలో లేదా సచివాలయంలో తాను సీఏం కుర్చీలో కూర్చోలేదని వివరణ ఇచ్చారు. కేవలం తమ ఇంట్లో ఉన్న కుర్చీలో మాత్రమే కూర్చున్నప్పటికి.. దీనిని ప్రతిపక్షాలు వివాదం చేస్తున్నాయని శ్రీకాంత్ షిండే మండిపడ్డారు. స్వయంగా సీఏం కుమారుడు శ్రీకాంత్ షిండే వివరణ ఇచ్చినప్పటికి ప్రతిపక్షాలు ఈవిషయాన్ని వదిలిపెట్టలేదు. విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. దీంతో ప్రతిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే సీఏం కుర్చీలో కూర్చున్నట్లు ఉన్న ఫోటోను ఏక్ నాథ్ షిండే వర్గం ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

సీఏం స్థానంలో ఎవరూ కూర్చున్నారో చూడాలంటూ ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన శీతల్ మెహత్రే ట్వీట్ చేశారు. సుప్రియా సూలే కూర్చున్న సీటు వెనకాల మహారాష్ట్ర ప్రభుత్వం- ముఖ్యమంత్రి అనే బోర్డు ఉంది. మాజీ మంత్రులు, ఎన్సీపీ నేతలు దిలీప్ వాల్సే పాటిల్, రాజేష్ తోపే ఆఫోటోలో ఉన్నారు. దీనిపై ఎన్సీపీ నేతలు మండిపడ్డారు. ఇది మార్ఫింగ్ చిత్రమని, ఈఫోటో రిలీజ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ముంబై పోలీసులకు ఎన్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. మొత్తం మీద ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సీఏం కుర్చీని వివాదంలోకి లాగారు. ఈవివాదం ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో