కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

మహారాష్ట్రలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పాల్ఘర్‌ జిల్లాలోని తారాపూర్‌ పారిశ్రామిక వాడలోని ఓ రసాయన కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. పారిశ్రామిక..

కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

Updated on: Aug 18, 2020 | 7:22 PM

మహారాష్ట్రలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పాల్ఘర్‌ జిల్లాలోని తారాపూర్‌ పారిశ్రామిక వాడలోని ఓ రసాయన కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. పారిశ్రామిక వాడలోని నందోలియా ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా ఓ రియాక్టర్ పేలింది. దీంతో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేప్టటారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక పేలుడు ధాటికి భారీ శబ్ధం రావడంతో సమీపంలోని ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. భారీగా మంటలు చెలరేగడంతో.. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది.. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Read More :

మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

బ్రెజిల్‌లో 33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

Loading...
Unable to load recommendations.
Follow Us