అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం

అరుణాచల్ ప్రదేశ్‌లో భూమి కంపించింది. అంజమ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు సంభవించాయి. మాగ్నిట్యూడ్‌పై ప్రకంపనల తీవ్రత 3.7గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. ఉదయం 3.36 నిమిషాలకు..

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం

Updated on: Aug 24, 2020 | 10:35 AM

అరుణాచల్ ప్రదేశ్‌లో భూమి కంపించింది. అంజమ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు సంభవించాయి. మాగ్నిట్యూడ్‌పై ప్రకంపనల తీవ్రత 3.7గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. ఉదయం 3.36 నిమిషాలకు చాంగ్లాంగ్‌కు 15 కిలో మీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలో 27.7 అకాంక్షలు, 96.79 రేఖాంశాలకు 15 కిలో మీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు భూకంప అధ్యయన కేంద్రం పేర్కొంది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో జనాలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించ లేదని అక్కడి అధికారులు పేర్కొన్నారు. కాగా ఆగష్టు 6న రాష్ట్రంలోని తవాంగ్కు 42 కిలో మీటర్ల దూరంలో భూకంపం సంభవించగా మాగ్నిట్యూడ్‌పై 3.0 తీవ్రత నమోదైంది.

Read more:

నిరుద్యోగుల కోసం గూగుల్ ఉపాధి కోర్సులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి.. 2.35 కోట్లకి చేరిన కేసులు

Loading...
Unable to load recommendations.
Follow Us