
శివపురి, నవంబర్ 27: మధ్యప్రదేశ్‌లోని శివపురిలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ట్రాక్టర్‌పైకి ఎక్కి చిన్నారి ఆడుకుంటుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ 30 అడుగుల లోతున్న బావిలో పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పూర్తిగా దెబ్బతినగా.. చిన్నారి శరీరంపై చిన్న గాయం కూడా లేకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన శివపురి జిల్లా కరైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని లంగూరి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా చర్చణీయాంశమైంది. లంగూరి సర్పంచ్ బలరాం పాల్ తెలిపిన వివరాల ప్రకారం..
నబాబ్ జాతవ్ అనే వ్యక్తికి ట్రాక్టర్ ఉంది. ఆ ట్రాక్టర్‌ను ఆదివారం సాయంత్రం ఇంటి సమీపంలో పార్క్ చేశారు. నవాబ్‌కు అన్షుల్, సుహాని(3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ నిలిపి ఉన్న ట్రాక్టర్‌పైకి ఎక్కి ఆడుకుంటున్నారు. ఇంతలో అకస్మాత్తుగా గేర్ ఊడిపోవడంతో ట్రాక్టర్ వాలుపైకి వెళ్లడం ప్రారంభించింది. గమనించిన నవాబ్ కుటుంబీకులు వెంటనే సుహానిని రక్షించగలిగారు. అన్షుల్‌ను రక్షించేలోపు ట్రాక్టర్ పక్కనే ఉన్న 30 అడుగుల లోతున్న బావిలో చిన్నారితో సహా పడిపోయింది. ఈ ఘటనలో అన్షుల్ మరణించి ఉంటాడని అక్కడున్న వారంతా అనుకున్నారు. కానీ బావిలో పిల్లాడు సురక్షితంగా ఉండటం చూపి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
విచిత్రమేమంటే.. బాలుడి శరీరంపై చిన్న గాయం కూడా లేదు. ఇక బావిలో పడిన ట్రాక్టర్ మాత్రం నుజ్జనుజ్జయ్యింది. బావి నీళ్లు లేకపోవడంతో పూర్తిగా ఎండిపోయింది. అందుకే ట్రాక్టర్ అందులో పడిన వెంటనే బావిలో నుంచి పెద్ద ఎత్తున దుమ్ము రేగిందని ఆ ఊరి సర్పంచ్ తెలిపాడు. ఈ ఘటన జరిగిన కొంత సేపటికి దుమ్ము సర్దుమనగడంతో నబాబ్ కుటుంబ సభ్యులు తాడు సాయంతో బావిలోకి దిగి చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పూర్తిగా దెబ్బతిన్నట్లు సర్పంచ్ తెలిపారు. ట్రాక్టర్ నుజ్జునుజ్జయిన చిన్నారి సురక్షితంగా ఉండటం నిజంగా అద్భుతం అంటూ ఊరుఊరంతా చెప్పుకోసాగారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.