
మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌కు చెందిన ఒక ఉపాధ్యాయురాలు పాకిస్తాన్ సైన్యానికి అనుకూలంగా ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత ఆమెను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం(మే 16) షహనాజ్ పర్వీన్ అనే ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మెహత్వారాలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ టీచర్ షహనాజ్ పర్వీన్ తన ఫేస్‌బుక్‌లో పాకిస్తాన్ సైన్యానికి అనుకూలంగా ఒక వీడియోను షేర్ చేసింది. ఇది కాస్తా వైరల్‌గా మారడంతో జిల్లా విద్యాశాఖ అధికారి సంజయ్ సింగ్ తోమర్ ఆమె సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆ వీడియోలో ఆ టీచర్ పాకిస్తాన్ సైన్యం భద్రత కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. మే 13న, జిల్లా విద్యాశాఖ అధికారి సంజయ్ సింగ్ తోమర్, అష్ట SDM స్వాతి మిశ్రాను దర్యాప్తు చేయమని కోరారు. దీంతో SDM స్వాతి మిశ్రా దర్యాప్తు చేసి శుక్రవారం నివేదికను సమర్పించారు. ఆ తర్వాత ఈ చర్య తీసుకున్నారు. పాకిస్తాన్ సైన్యానికి అనుకూలంగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం ద్వారా టీచర్ షహనాజ్ పర్వీన్ భారత పౌర భద్రతా నియమావళిని ఉల్లంఘించింది. దీంతో ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది.
ఇది దుష్ప్రవర్తనగా పరిగణించి, సెక్షన్ 163, ఇతర నిబంధనల ప్రకారం సదరు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. టీచర్ షహనాజ్ పర్వీన్ సెహోర్‌లోని జావర్ నివాసి. అయితే పాకిస్థాన్‌కు మద్దతుగా ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు దానిపై తీవ్రంగా స్పందించడం ప్రారంభించారు. దీని తరువాత ఈ విషయంపై చర్చ ప్రారంభమైంది. ఆ వీడియోను షేర్ చేసినందుకు ఆ టీచర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. వీడియోను షేర్ చేసే విషయం విద్యా శాఖకు చేరింది. దర్యాప్తు చేపట్టిన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుని, ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, వాటికి దూరంగా ఉండాలి. అటువంటి పరిస్థితిలో, ఇప్పుడు ఆ ఉపాధ్యాయురాలిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..