Viral Video: మనుషులకే కాదు.. దేవుళ్లకూ చలి! రక్షణ కోసం ఈ ప్రత్యేక ఏర్పాటు

|

Dec 08, 2023 | 1:47 PM

మనుషులు సరే.. అదే దేవుళ్లకు చలి వేస్తె రక్షణ ఏమిటి? అన్ని కొందరు భక్తులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రాణప్రతిష్ట చేసిన ఆలయాల్లో దేవుళ్ళు కొలువై ఉంటారని హిందువుల నమ్మకం. అందుకనే ఆ దేవుళ్లకు ఆహారాన్ని, పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇప్పుడు మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో ప్రముఖ ఆలయంలో దేవతా విగ్రహాలకు చలి నుంచి రక్షణ కోసం స్వెటర్లు, దుప్పట్లు, శాలువాలతో అలంకరిస్తున్నారు. 

Viral Video: మనుషులకే కాదు.. దేవుళ్లకూ చలి! రక్షణ కోసం ఈ ప్రత్యేక ఏర్పాటు
Viral Video
Follow us on

ప్రతి మనిషి కాలానికి అనుగుణంగా దుస్తులను ధరిస్తారు. ఎండల నుంచి ఉపశనం కోసం తేలికపాటి కాటన్ దుస్తులను, వర్షాకాలంలో రెయిన్ కోట్ ను , శీతాకాలంలో ఉన్ని దుస్తులను ధరించడానికి ఆసక్తిని చూపిస్తారు. ప్రస్తుతం శీతాకాలం. దీంతో గజగజ వణికించే చలిలో చలి చంపేస్తుంది అంటూ తమని చలి నుంచి రక్షించుకోవడానికి సెటర్లు ధరిస్తారు. లేదా దుప్పట్లు కప్పుకుంటారు. మరి మనుషులు సరే.. అదే దేవుళ్లకు చలి వేస్తె రక్షణ ఏమిటి? అన్ని కొందరు భక్తులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రాణప్రతిష్ట చేసిన ఆలయాల్లో దేవుళ్ళు కొలువై ఉంటారని హిందువుల నమ్మకం. అందుకనే ఆ దేవుళ్లకు ఆహారాన్ని, పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ప్రముఖ ఆలయంలో దేవతా విగ్రహాలకు చలి నుంచి రక్షణ కోసం స్వెటర్లు, దుప్పట్లు, శాలువాలతో అలంకరిస్తున్నారు.

సంకట మోచన హనుమాన్ దేవాలయంలోని దేవుళ్లను శీతాకాలపు చల్లటి గాలి నుండి రక్షించడానికి వెచ్చని దుస్తులతో అలంకరించారు. భక్తులు కానుకలుగా సమర్పించిన స్వెటర్లు, దుప్పట్లు, శాలువాలను హనుమంతుడి సహా అనేక దేవుళ్లను అలంకరించారు. ఇప్పుడు ANI షేర్ చేసిన వీడియోలో హనుమంతుడు, గణేష్, శివుడు, ఇతర దేవతలతోపాటు, హనుమాన్ ఆలయం లోపల శాలువాలు, ఇతర వెచ్చని బట్టలు అలంకరించినవి చూడవచ్చు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..