లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదు.. ఇంకా చెప్పాలంటే అదృష్ట వంతుడిని పాడు చేసేవాడు లేడు దురదృష్ట వంతుడిని బాగు చేసేవాడు లేడు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విషయన్ని అప్పుడప్పుడు నమ్మాల్సిందే ని కొన్ని కొన్ని సంఘటలు వెలుగులోకి వచ్చి నిరూపిస్తూ ఉంటాయి. తాజాగా ఓ రైతు ఇంట కాసుల వర్షం కురిసింది. లీజుకు తీసుకున్న భూమిలో విలువైన రాయి దొరికింది. ఈ డైమండ్ విలువ లక్షల్లో ఉన్నట్లు అంచనావేస్తున్నారు. అవును వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందిన మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని ఓ రైతును ఓ వజ్రం మరోసారి ధనవంతుడిని చేసింది. తాను లీజుకి తీసుకున్న గనిలో దొరికిన వజ్రంతో రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు ఆ రైతు. ఇప్పుడు ఆ రైతు ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని గౌరేయ కకర్రాహతి గ్రామానికి చెందిన దేశ్‌రాజ్ ఆదివాసీ దంపతులకు శుక్రవారం 6.65 క్యారెట్ల వజ్రం లభించింది. ఈ వజ్రం దాదాపు రూ.25 లక్షలు ఉంటుందని అంచనా. ఈ దంపతులకు ఇదే ప్రదేశంలో కొన్ని వారల క్రితం కూడా చాలా చిన్న వజ్రం లభించింది. కొంతకాలం క్రితం నుంచి బజారియా గ్రామంలో దంపతులు లీజుకు తీసుకున్న భూమిలో వజ్రాల అన్వేషణ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్న ఈ దంపతులకు ఎట్టకేలకు నిన్న గులకరాళ్లు, మట్టితో పాటు మెరుస్తున్న రాయి కనిపించింది. దీనిని జాగ్రత్తగా తవ్వి వెలికి తీయండతో ఈ దంపతుల ప్రయత్నాలు ఫలించాయి.
విభిన్నంగా కనిపించే గులకరాయిని చూసి.. దాని మీద దుమ్మును తొలగించిన తర్వాత ఆ దంపతులు చాలా సంతోషించారు. దుమ్మును తొలగించిన తర్వాత ఆ రాయి మెరిసిపోవడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. దేశ్‌రాజ్ ఆ రాయిని పన్నాలోని డైమండ్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ ఉంచాడు. వజ్రం ఇప్పుడు వేలం వేయబడుతుంది. పన్ను మినహాయింపు తర్వాత అతను ధరను పొందుతాడని.. త్వరలో జరగనున్న వజ్రాల వేలంలో ఈ వజ్రాన్ని ఉంచుతామని పన్నా డైమండ్ ఆఫీసు అధికారులు తెలిపారు.
దేశ్‌రాజ్‌కి ఇది మొదటి సారి కలిగిన అదృష్టం కాదు. గత కొన్ని వారాల క్రితం అతను అదే స్థలంలో 1.35 క్యారెట్ వజ్రాన్ని కనుగొని డైమండ్ కార్యాలయంలో డిపాజిట్ చేశాడు. ఈసారి అతను పెద్దదైన, ఖరీదైన రాయిని పొందాడు. వేలంలో ఈ వజ్రం సుమారు రూ.25 లక్షల వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నారు.
మరిని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..