Money Donate: నిజమైన శ్రీమంతుడు.. యావదాస్తిని దానం చేసిన బిజినెస్‌మెన్.. భార్య, కొడుకుతో కలిసి..

Money Donate: సాధారణంగా చాలా మంది ప్రజలు.. కోటీశ్వరులు పిల్లికి కూడా భిక్షం వేయరని భావిస్తుంటారు. అలా ఉండబట్టే

Money Donate: నిజమైన శ్రీమంతుడు.. యావదాస్తిని దానం చేసిన బిజినెస్‌మెన్.. భార్య, కొడుకుతో కలిసి..
Surana

Updated on: May 19, 2022 | 7:22 AM

Money Donate: సాధారణంగా చాలా మంది ప్రజలు.. కోటీశ్వరులు పిల్లికి కూడా భిక్షం వేయరని భావిస్తుంటారు. అలా ఉండబట్టే వారు ఆ స్థాయిలో ఉన్నారని అనుకుంటుంటారు. అయితే, అది విషయంలోనూ ఒకేలా ఉండదనే కొందరు మాత్రమే భావిస్తారు. ఎందుకంటే.. ఈ లోకంలో పిసినారి వాళ్లతో పాటు.. దాతృత్వ గుణం ఉన్నవారూ ఉన్నారు. అదే విషయాన్ని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ నగల వ్యాపారి నిరూపించారు. అచ్చం సినిమాల్లో చూపించినట్లుగానే చేసి అందరినీ షాక్‌కు గురి చేశారు. తన యావదాస్తిని విరాళంగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం బాలాఘాట్‌కు చెందిన ప్రముఖ ఆభరణాల వ్యాపారి రాకేశ్ సురానా రూ. 11 కోట్ల విలువైన ఆస్తులను విరాళంగా ఇచ్చేశాడు. గోశాల, ఆధ్యాత్మిక సంస్థలకు వీటిని రాసిచ్చాడు. అంతేకాదు. విలాసవంతమైన జీవితాన్ని వీడి తన భార్య కొడుకుతో కలిసి ఆధ్యాత్మిక జీవితం గడపాలని సురానా నిర్ణయించుకున్నాడు. గురు మహేంద్ర సాగర్ స్ఫూర్తితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు రాకేశ్​సురానా. కాగా, ఈ గొప్ప నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఆయన కుటుంబాన్ని స్థానికులు రథంలో ఊరేగించారు. సన్మానించారు.

Follow Us