Madhya Pradesh Elections: కమల్‌నాథ్ సర్కార్‌ను పడగొట్టిన కీలక నేతకు దక్కని టికెట్

భారతీయ జనతా పార్టీ ప్రకటించిన మధ్యప్రదేశ్ అభ్యర్థుల జాబితాపై చాలా చోట్ల ఆసమ్మతి తలెత్తింది. గ్వాలియర్‌లోని బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఇంటి మందు ఆందోళనకు దిగారు ఆశావాహులు. మాజీ మంత్రి మాయా సింగ్‌కు టిక్కెట్టును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. సింధియా మద్దతుదారుల్లో ఒకరైనా మున్నాలాల్ గోయల్ టికెట్ రద్దుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జై విలాస్ ప్యాలెస్‌ను ఘెరావ్ చేసి అక్కడ నిరసనలు చేపట్టారు.

Madhya Pradesh Elections: కమల్‌నాథ్ సర్కార్‌ను పడగొట్టిన కీలక నేతకు దక్కని టికెట్
Bjp Protest

Updated on: Oct 22, 2023 | 3:55 PM

క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే బీజేపీ కార్యకర్తలు కూడా అసెంబ్లీ టిక్కెట్ల కోసం రోడ్డెక్కుతున్నారు. మధ్యప్రదేశ్‌లో టిక్కెట్‌ లభించని నేతల అనుచరులు పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికేతరులకే ఎక్కువ టిక్కెట్లు కేటాయించారని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

భారతీయ జనతా పార్టీ ప్రకటించిన మధ్యప్రదేశ్ అభ్యర్థుల జాబితాపై చాలా చోట్ల ఆసమ్మతి తలెత్తింది. గ్వాలియర్‌లోని బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఇంటి మందు ఆందోళనకు దిగారు ఆశావాహులు. మాజీ మంత్రి మాయా సింగ్‌కు టిక్కెట్టును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. సింధియా మద్దతుదారుల్లో ఒకరైనా మున్నాలాల్ గోయల్ టికెట్ రద్దుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జై విలాస్ ప్యాలెస్‌ను ఘెరావ్ చేసి అక్కడ నిరసనలు చేపట్టారు. సింధియా స్వయంగా వారి మధ్యకు చేరుకుని ఒప్పించే ప్రయత్నాలు చేశారు.

గ్వాలియర్ ఈస్ట్ రీజియన్ మాజీ ఎమ్మెల్యే మున్నాలాల్ గోయల్ భారతీయ జనతా పార్టీలో గట్టి పోటీదారుగా ఉన్నారు. గోయల్ 2018లో కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచారు. అయితే జ్యోతిరాదిత్య సింధియా కమల్‌నాథ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో మున్నాలాల్ గోయల్ కూడా ఉన్నారు. 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో గోయల్ బీజేపీ తరపున పోటీ చేశారు. అదే ప్రాంతం నుంచి టికెట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సతీష్‌ సికర్వార్‌ చేతిలో ఓడిపోయారు. అయితే, దీన్ని పట్టించుకోకుండా రాష్ట్ర విత్తన, వ్యవసాయ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా చేసి కేబినెట్‌ మంత్రి హోదా కల్పించారు.

ఉప ఎన్నికలో ఓటమి పాలైనప్పటికీ, గోయల్ అతని మద్దతుదారులు ఈ ప్రాంతంలో నిరంతరం చురుకుగా ఉన్నారు. ఆయన అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్వహించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పార్టీ సంస్థాగత కార్యక్రమాలలో కూడా కీలక పాత్ర పోషించారు. ఈసారి కూడా గోయల్‌కే టిక్కెట్‌ వస్తుందని ఆయన మద్దతుదారులు భావించారు, అయితే వెలువడిన అభ్యర్థుల జాబితాలో ఆయన స్థానంలో మాయా సింగ్‌కు టికెట్‌ ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జై విలాస్ ప్యాలెస్ వరకు ర్యాలీగా చేరుకుని.. నిరసనలు తెలుపుతూ ఆందోళనకు దిగారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…