
మధ్యప్రదేశ్ లో సంచలన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇండోర్ లోని MIG పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 13 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి హతమార్చారు. హత్య తర్వాత, నిందితుడు మృతదేహాన్ని తన సొంత ఇంట్లోని బెడ్ బాక్స్‌లో దాచిపెట్టాడు. బాలుడి గురించి ఏమి తెలియనట్లు నటించాడు. చివరికి పోలీసులు సాంకేతిక ఆధారాలతో తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది.
ప్రధాన నిందితుడు రెహాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి పొరుగున ఉండే మైనర్ బాలుడు అతిఫ్‌ను రెహాన్ తోపాటు మరో మైనర్ బాలుడు కిడ్నాప్ చేశారు. అమాయక బాలుడిని ఒక భవనం పైకప్పుపైకి తీసుకెళ్లి, అక్కడ అతన్ని దారుణంగా హత్య చేశారు. అనంతరం, సాక్ష్యాలను దాచడానికి నిందితులు అతిఫ్ మృతదేహాన్ని బెడ్ బాక్స్‌లో బంధించారు. అతిఫ్ చాలా సేపటి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో, అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు. ఆశ్చర్యకరంగా, ప్రధాన నిందితుడు రెహాన్, పోలీసులు, కుటుంబ సభ్యులతో కలిసి అతిఫ్ కోసం వెతుకుతున్నట్లు నటించాడు. అనుమానం రాకుండా ఉండటానికి అతను దర్యాప్తులో ప్రతిచోటా పోలీసులతో పాటు వెళ్లాడు.
కేసు తీవ్రత దృష్ట్యా, పోలీసులు డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించారు. దర్యాప్తు సమయంలో, స్నిఫర్ డాగ్ నిందితుడు రెహాన్ వద్దకు వచ్చినప్పుడు, అది అతనిపై మొరగడం ప్రారంభించింది. ఈ ప్రవర్తన పోలీసుల అనుమానాన్ని రేకెత్తించింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని తీవ్రంగా విచారించినప్పుడు, హత్యకు సంబంధించిన మొత్తం రహస్యాన్ని వెల్లడించాడు.
నిందితులు ఆ ప్రాంతంలో అక్రమంగా మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్నారని అతిఫ్ తండ్రి రఫీక్, ఇతర కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదకద్రవ్యాలు అమ్ముతున్నట్లు అతిఫ్ చూసినట్లు కుటుంబం అనుమానిస్తోంది. బయటపడతారనే భయంతో నిందితులు ఆ అమాయకుడిని చంపేశారు. సంఘటనాస్థల నుండి రక్తంతో తడిసిన జాకెట్, ఇతర ముఖ్యమైన ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రెహాన్‌తోపాటు మరొకరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు MIG పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ CB సింగ్ తెలిపారు. ఈ హత్యలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కాకుండా మరేదైనా కారణంగా ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..