కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. యువతిపై కత్తితో దాడిచేసిన యువకుడు సుశాంత్.. అనంతరం తనను తాను గొంతు కోసుకున్నాడు. మంగళూరులోని క్షణికావేశంలో జరిగిన ఈ ఘటన ఇద్దరి ప్రాణాల మీదకు వచ్చింది. ప్రేమించిన అమ్మాయిని దారుణంగా హత్య చేసి, తానూ గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళూరులో సంచలనం రేపుతోంది. అమ్మాయిని 12 సార్లు కత్తితో పొడుస్తూ.. అరుస్తూ.. పైశాచిక ఆనందం పొందాడు. అనంతరం అమ్మాయి దగ్గర కూర్చోని ఏడుస్తూ అతనూ పొడుచుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వమని.. అతను కూడా మెడ కోసుకున్నాడు. ఈ దాడిలో అమ్మాయి మరణించగా.. అబ్బాయి ప్రాణాలతో పోరాడుతున్నాడు.