ఇక.. ఎంపీల వేతనాల్లో 30 శాతం కట్

కోవిడ్‌-19తో తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఎంపీల వేతనాల్లో కోత విధిస్తూ పార్లమెంట్‌ సభ్యుల వేతనాలు, పెన్షన్‌ (సవరణ) బిల్లు - 2020 కు ఆమోదం లభించింది. ఈ బిల్లును లోక్‌సభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో పార్లమెంట్‌ సభ్యుల..

ఇక.. ఎంపీల వేతనాల్లో 30 శాతం కట్

Updated on: Sep 15, 2020 | 7:59 PM

కోవిడ్‌-19తో తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఎంపీల వేతనాల్లో కోత విధిస్తూ పార్లమెంట్‌ సభ్యుల వేతనాలు, పెన్షన్‌ (సవరణ) బిల్లు – 2020 కు ఆమోదం లభించింది. ఈ బిల్లును లోక్‌సభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో పార్లమెంట్‌ సభ్యుల వేతనంలో 30 శాతం కోత విధించే అవకాశం కేంద్రప్రభుత్వానికి కలుగుతుంది. ఇక నిత్యావసర వస్తువుల చట్టంలో సవరణలపై లోక్‌సభలో చర్చ జరిగింది. మరోవైపు డీజీసీఏ, ఏఏఐబీ, బీసీఏఎస్‌లకు చట్టపరమైన అధికారాలను కల్పించే ఎయిర్‌క్రాఫ్ట్‌ సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడం పట్ల పౌరవిమానయాన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదంతో భారత పౌరవిమానయాన రంగంలో భద్రత మౌలికసదుపాయాలు మరింత బలోపేతమవుతాయని ఆయన పేర్కొన్నారు.