దేశవ్యాప్తంగా ముగిసిన 6వదశ పోలింగ్.. ఏడో దశపై నేతల ప్రత్యేక దృష్టి..

లోక్‌సభ ఎన్నికల్లో ఆరో దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 58 శాతం పోలింగ్‌ నమోదయినట్లు తెలిపారు ఎన్నికల అధికారులు. దేశవ్యాప్తంగా ఈ దశలో 58 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో సాయంత్రం 5 గంటల వరకు 54 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. 2019 ఎన్నికల్లో ఢిల్లీలో 60 శాతానికిపైగా పోలింగ్‌ నమోదు కాగా ఈసారి తగ్గే అవకాశం కన్పిస్తోంది.

దేశవ్యాప్తంగా ముగిసిన 6వదశ పోలింగ్.. ఏడో దశపై నేతల ప్రత్యేక దృష్టి..
Lok Sabha Election 2024
Follow us

|

Updated on: May 25, 2024 | 6:40 PM

లోక్‌సభ ఎన్నికల్లో ఆరో దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 58 శాతం పోలింగ్‌ నమోదయినట్లు తెలిపారు ఎన్నికల అధికారులు. దేశవ్యాప్తంగా ఈ దశలో 58 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో సాయంత్రం 5 గంటల వరకు 54 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. 2019 ఎన్నికల్లో ఢిల్లీలో 60 శాతానికిపైగా పోలింగ్‌ నమోదు కాగా ఈసారి తగ్గే అవకాశం కన్పిస్తోంది. ఢిల్లీలో ఎండ తీవ్రత కారణంగా ఓటింగ్‌ శాతం తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. బెంగాల్‌లో మాత్రం ఈసారి కూడా పెద్ద ఎత్తున పోలింగ్‌ శాతం నమోదయ్యింది. సాయంత్రం 5 గంటల వరకు 78 శాతం పోలింగ్‌ నమోదయ్యిందని తెలిపారు ఎన్నికల అధికారులు. అయితే పోలింగ్‌ సందర్భంగా పలు చోట్లు టీఎంసీ, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదంతోపాటు ఘర్షణ వాతావరణం చెలరేగింది. వీటిని పోలీసులు సర్థుమణిగించే ప్రయత్నం చేశారు. ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో సాయంత్రం 5 గంటల వరకు కేవలం 52 శాతం పోలింగ్‌ నమోదు కావడం ఈసీ అధికారులను నిరాశపర్చింది.

ఇక ఈరోజు జరిగిన పోలింగ్‎తో మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 486 స్థానాల్లో ఎన్నికలు పూర్తవుతాయి. హర్యానా, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్‌లలో కూడా నేటితో పోలింగ్ పూర్తవుతుంది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీహార్, బెంగాల్‌లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ జరిగింది. అలాగే ఢిల్లీలో ఏడు, హర్యానాలో 10, జార్ఖండ్‌లో నాలుగు, ఉత్తరప్రదేశ్‌లో 14 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటకు ముగిసింది. జమ్మూ – కాశ్మీర్‌లోని చివరి పార్లమెంట్ స్థానంతోపాటు అనంత్‌నాగ్-రాజౌరిలో పోలింగ్‌ను మూడో దశ నుంచి ఆరో దశకు మార్చడంతో ఇక్కడ కూడా సజావుగా పోలింగ్ నడిచింది.

ఇప్పటి వరకు 6 దశల పోలింగ్ కు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఇక మొత్తం ఏడు దశల్లో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మే 25న ఆరవ దశ పోలింగ్ పూర్తి అయింది. చివరి దశ పోలింగ్ కోసం రేపటి నుంచి అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్య నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఏడవ దశ పోలింగ్ ప్రక్రియ జూన్ 1న జరగనుంది. మొత్తం దేశంలో 543 పార్లమెంట్ స్థానాలకు గానూ నేటికి 486 స్థానాల్లో పోలింగ్ పూర్తైంది. మిగిలిన 57 స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఏడోదశ పోలింగ్ అనంతరం జూన్ 4న ఫలితాలు విడుదల అవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్