AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: పోయిన చోటే వెతుక్కోనున్న రాహుల్.. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ..

Lok Sabha Elections 2024: ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడు నియోజకవర్గం నుంచే పోటీకి దిగుతారని కేరళ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుండగా.. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మరోలా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు అజయ్ రాయ్ అంటున్నారు. దీంతో పాటు రాహుల్ గాంధీ ఖచ్చితంగా అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రకటించారు. ప్రియాంక గాంధీ మాత్రం..

Rahul Gandhi: పోయిన చోటే వెతుక్కోనున్న రాహుల్.. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ..
Rahul Gandhi
Sanjay Kasula
|

Updated on: Aug 18, 2023 | 6:40 PM

Share

2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అన్ని పార్టీలు బిజీబిజీగా మారిపోయాయి. అయితే, రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ వర్గాలు మాత్రం తమ తోచినట్లుగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడు నియోజకవర్గం నుంచే పోటీకి దిగుతారని కేరళ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుండగా.. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మరోలా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు అజయ్ రాయ్ అంటున్నారు. దీంతో పాటు రాహుల్ గాంధీ ఖచ్చితంగా అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రకటించారు. ప్రియాంక గాంధీ మాత్రం ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అక్కడి నుంచి పోటీ చేస్తారని.. ప్రియాంక కావాలంటే వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని అన్నారు. అయితే గతంలో రాహుల్ గాంధీపై గెలిచిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కూడా అజయ్ రాయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తే అక్కడి పార్టీ క్యాడర్‌లో జోష్ నింపడంతో పాటు సరిహద్దుగా ఉండటంతో కర్నాటకలో కూడా ఆ ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. కొన్ని తరాలుగా అమేథీ కాంగ్రెస్ స్థానమని మీకు చెప్పుకొచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ కోటలో పాగా వేశారు. అమేథీ లోక్‌సభ స్థానంలో రాహుల్ గాంధీ స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అమేథీ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ కుటుంబ స్థానం. సంజయ్ గాంధీ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కూడా ఈ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇది కాకుండా, రాహుల్ గాంధీ అమేథీ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడు సార్లు పార్లమెంటు సభ్యునిగా కూడా ఉన్నారు.

ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ స్థానం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. రాహుల్ గాంధీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐకి చెందిన పీపీ సునీర్‌ను లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ మళ్లీ అమేథీలో ఎన్నికల రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ చెప్పడంతో చర్చ జోరందుకుంది. తాజాగా మోదీ ఇంటిపేరు కేసులో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. పరువు నష్టం కేసులో ఆయనకు రెండేళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత ఆయన ఎంపీ అనర్హత వేటు పడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం