మిడతల దండుతో ముంచుకొస్తున్న ముప్పు.. రైతుల్లో పెరుగుతున్న గుబులు

| Edited By: Pardhasaradhi Peri

May 27, 2020 | 12:39 PM

ఓవైపు దేశం కరోనా వైరస్ తో అల్లాడుతుండగా, మరోవైపు లక్షల సంఖ్యలో వస్తున్న మిడతల దండుతో ప్రమాదం ముంచుకొస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో రైతులకు ఇవి కంటిమీద కునుకు లేకుండా  చేస్తున్నాయి.

మిడతల దండుతో ముంచుకొస్తున్న ముప్పు.. రైతుల్లో పెరుగుతున్న గుబులు
Follow us on

ఓవైపు దేశం కరోనా వైరస్ తో అల్లాడుతుండగా, మరోవైపు లక్షల సంఖ్యలో వస్తున్న మిడతల దండుతో ప్రమాదం ముంచుకొస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో రైతులకు ఇవి కంటిమీద కునుకు లేకుండా  చేస్తున్నాయి. జూన్ నెలలో వర్షాకాల సీజన్ ప్రారంభం కాకమునుపే వీటి బెడదను నివారించలేకపోతే భారీగా పంటలు నష్టపోతామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరి, చెరకు, పత్తి, సోయాబీన్.. ఇలా ఏ పంటనైనా ఇవి క్షణాల్లో నాశనం చేస్తాయి. ఆఫ్రికా నుంచి యెమెన్, ఇరాన్, పాకిస్తాన్ దేశాల ద్వారా మిడతలు ఇండియాలో ప్రవేశించాయి. మొదట రాజస్తాన్, గుజరాత్, ఆ తరువాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇప్పుడు యూపీలో ఇవి ప్రవేశించాయి. ఒక్క రాజస్థాన్ రాష్ట్రంలో వీటివల్ల అనేక  హెక్టార్లలో పంటను రైతులు నష్టపోయారు. మధ్యప్రదేశ్ లోని 17 జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ! మిడతల దండు కారణంగా 1993 లో దేశంలో మూడు లక్షల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. వీటి బెడదను ఎలా ఎదుర్కోవాలో తెలియక వ్యవసాయ నిపుణులు, రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు.