Telugu News India News Lockdown announced in tamilnadu from 10th may to 24th may 14 days here is lockdown rules
Lockdown: తమిళనాడులో పూర్తి లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం..ఎప్పటి నుంచి అంటే..
Lockdown in Tamil Nadu: రాష్ట్రంలో కోవిడ్ -19 సంక్రమణ వ్యాప్తిని ఆపడానికి తమిళనాడులో 14 రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ విధించనున్నారు. గత కొన్ని రోజులుగా కోవిడ్ -19 కేసులు పెరగడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Lockdown: రాష్ట్రంలో కోవిడ్ -19 సంక్రమణ వ్యాప్తిని ఆపడానికి తమిళనాడులో 14 రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ విధించనున్నారు. గత కొన్ని రోజులుగా కోవిడ్ -19 కేసులు పెరగడంతో తమిళనాడు ప్రభుత్వం మే 10 నుంచి మే 24 వరకు రాష్ట్రంలో పూర్తి లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం, కోవిడ్ -19 కేసులు పెరగడం వల్ల రాష్ట్రంలో “అనివార్యమైన పరిస్థితుల” కారణంగా షట్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీసుకున్న మొదటి ప్రధాన నిర్ణయాలలో లాక్ డౌన్ ప్రకటన ఒకటి.
మే 10 నుండి పూర్తి లాక్ డౌన్ సమయంలో తమిళనాడులో..
కూరగాయలు, మాంసం, చేపల దుకాణాలు, తాత్కాలిక దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పనిచేయడానికి అనుమతించబడతాయి. మిగతా అన్ని షాపులు మూసివేయబడతాయి.
ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం షాపులు తమిళనాడులో 14 రోజుల పూర్తి లాక్ డౌన్ సందర్భంగా మూసివేస్తారు. టేకెవే సేవలకు మాత్రమే రెస్టారెంట్లు తెరవడానికి అనుమతిస్తారు.
తమిళనాడులో 14 రోజుల పూర్తి లాక్ డౌన్ సమయంలో, అవసరమైన సేవలు మాత్రమే పనిచేయడానికి అనుమతిస్తారు.
లాక్ డౌన్ సమయంలో పెట్రోల్ మరియు డీజిల్ బంకులు తెరిచి ఉంటాయి.
మే 10, సోమవారం నుండి పూర్తి లాక్ డౌన్ సందర్భంగా, రెండు వారాల పూర్తి లాక్ డౌన్ కోసం ప్రజలు సిద్ధం కావడానికి అన్ని దుకాణాలను శనివారం మరియు ఆదివారం ఉదయం 6 నుండి 9 గంటల వరకు తెరిచి ఉంచడానికి అనుమతిస్తారు.
భారతదేశంలో రోజువారీ కోవిడ్ -19 కేసులకు అత్యధికంగా నమోదు అవుతున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. గత 24 గంటల్లో తమిళనాడులో 26,465 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.