నా రథయాత్ర లక్ష్యం సిధ్ధించింది, ఎల్.కె. అద్వానీ

రామజన్మ భూమి ఉద్యమంలో తాను చేసిన కృషికి ఫలితం లభించిందని బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ అన్నారు. నా రథయాత్ర లక్ష్యం సిద్ధించింది...

నా రథయాత్ర లక్ష్యం సిధ్ధించింది, ఎల్.కె. అద్వానీ

Edited By:

Updated on: Aug 05, 2020 | 10:28 AM

రామజన్మ భూమి ఉద్యమంలో తాను చేసిన కృషికి ఫలితం లభించిందని బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ అన్నారు. నా రథయాత్ర లక్ష్యం సిద్ధించింది…1990 లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు నేను నిర్వహించిన రథయాత్ర ఇన్నాళ్లకు ఫలితమిచ్చింది.. ఇది చరిత్రాత్మకమైన రోజు అని ఆయన పేర్కొన్నారు. నాడు వేలాది మంది తనవెంట వచ్చారని, వారి ఆశలు, ఆశయాలు నేడు తీరబోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్న ఈ రోజు శుభ దినం అని పేర్కొన్నారు. ఇదే బీజేపీ లక్ష్యం కూడా అన్నారు. ఈ ఆలయ నిర్మాణం… భారతీయులందరిలో రాముని సద్గుణాల స్ఫూర్తిని నింపుతుందని ఆశిస్తున్నా అని 92 ఏళ్ళ అద్వానీ ఉద్వేగంగా చెప్పారు.

 

Follow Us