Whiskey: మద్యం ప్రియులకు ఒక్కో బ్రాండ్ అంటే ఇష్టం. ఎవరికి నచ్చిన బ్రాండ్‌ను వారు తీసుకుంటుంటారు. ఇక మద్యంలో విస్కీ బ్రాండ్‌లు రకరకాలుగా ఉంటాయి. వాటిలో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్‌ను ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాటిలో ఉండే ఫ్లేవర్లు దానికి కారణం. అసలు విస్కీకి ప్లేవర్ ఎలా వస్తుంది..? దానికి గుర్తించడానికి ఓరేగావ్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన డస్టిన్ హెర్బ్ నేతృత్వంలోని ఓ బృందం పలు అధ్యయనాలు చేసింది. వారు చేసిన అధ్యయనాల్లో తెలిసిందేమిటంటే.. విస్కీని తయారు చేయడానికి ఉపయోగించే బార్లీని పండించే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా ప్లేవర్ మార్పులు సంభవిస్తాయని గుర్తించారు. ఈ కారణంగానే వైన్‌లాగా విస్కీలో కూడా రుచులు మారుతాయంటున్నారు.
అయితే విస్కీ ఫ్లేవర్‌లలో తేడా గుర్తించడానికి వాతావరణ పరిస్థితులపై చేసిన ఈ అధ్యయనమే తొలిదని చెబుతున్నారు. ఈ విషయంపై డస్టిన్ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి చాలా పెద్ద పరిశోధన అవసరం ఉంది. దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. బార్లీని పండించే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా విస్కీ రుచుల్లో తేడా వస్తుందని మా పరిశోధనల్లో తేలింది అని వెల్లడించారు.
పరిశోధన బృందం ముందు బీర్లు తయారీకి ఉపయోగించే బార్లీ, వాటి రుచులపై పరిశోధన చేశారు. బార్లీలో రకాలను బట్టి బీర్ల రుచుల్లో గణనీయమైన మార్పులను గుర్తించారు. ఇదే సూత్రం విస్కీకి కూడా వర్తిస్తుందా..? అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతున్నారు. ఐర్లాండ్‌లోని రెండు కమర్షియల్ బార్లీ వెరైటీలైన ఒలంపస్, లారియేట్‌లపై పరిశోధనలు ప్రారంభించారు. బన్‌క్లోడీ అనే తీర ప్రాంతంలో పండించే ఒక వెరైటీని, అతీ అనే మైదాన ప్రాంతంలో పండించే మరో వెరైటీని ఎంపిక చేసుకున్నారు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతలలో మార్పులు ఉంటాయి. అలాగే మట్టిలో కూడా తేడా స్పష్టంగా ఉంటుంది.
ఒక పద్దతిలో వీటిని మాల్డ్‌లా మార్చారు. బార్లీ మాల్ట్ డిస్టిల్డ్ అయిన తర్వాత దానిని న్యూమేక్‌స్పిరిట్ అంటారు. ఈ స్పిరిట్‌ను మూడేళ్లు చెక్క పీపాలో ఉంచాక అది విస్కీగా మారుతుంది. వివిధ పరిశోధనల ద్వారా స్పిరిట్‌లోని రుచులను వర్గీకరించారు. బార్లీ పండించిన ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు విస్కీ అరోమాకు కారణంగా గుర్తించారు. అతీలో పండించిన బార్లీ నుంచి తయారు చేసిన విస్కీకి తీయని, పుల్లని తృణ ధాన్యాల వాసనతో కూడిన అరోమా రాగా, బన్‌క్లోడీలో పండించిన బార్లీ నుంచి తయారు చేసిన విస్కీకి ఎండు ఫలాల వాసనతో కూడిన అరోమా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. అయితే విస్కీలో తయారు చేయడానికి బార్లీ ఉపయోగించే వాతావరణం ఆధారంగా మాత్రమే విస్కీలో రుచి తేడాలు గుర్తించబడతాయని యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది.
Also Read: Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనున్న 22 ప్రత్యేక రైళ్లు