Leopard attack : గ్రామంలోకి వచ్చిన చిరుత.. పట్టుకోబోయిన అటవీశాఖ అధికారులు, పోలీసుల పైన దాడి

|

Mar 12, 2021 | 4:08 AM

ఇటీవల ఎక్కడ చూసిన పులులదాడులు ఎక్కువ గనిపిస్తున్నాయి. అడవులను వాడాలి వన్యమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి.  తాజాగా ఓ చిరుత పులి నానా హాంగామా చేసింది. కనిపించిన అందరిపై

Leopard attack :  గ్రామంలోకి వచ్చిన చిరుత.. పట్టుకోబోయిన అటవీశాఖ అధికారులు, పోలీసుల పైన దాడి
Follow us on

Leopard attack : ఇటీవల ఎక్కడ చూసిన పులులదాడులు ఎక్కువ గనిపిస్తున్నాయి. అడవులను వాడాలి వన్యమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి.  తాజాగా ఓ చిరుత పులి నానా హాంగామా చేసింది. కనిపించిన అందరిపై దాడులు చేస్తూ.. హల్‌చల్‌ చేసింది. ఈ చిరుతపై సమాచారం అందుకుని.. స్పాట్‌కు చేరుకున్న.. పోలీస్‌లపై కూడా దాడి చేసింది చిరుత. మొత్తం ఐదుగురిపై చిరుత దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన విజువల్స్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.

చిరుతను బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. న్యూ రాణి బాగ్‌ ప్రాంతంలోని ఖాండ్వా రోడ్‌ వద్ద గురువారం ఒక చిరుత పులి హల్‌చల్‌ చేసింది. ఒక చిన్నారి, ఆమె తల్లితోసహా ఐదుగురు స్థానికులపై దాడి చేసింది. అనంతరం నిర్మాణంలో ఒక భవనంలోకి ఆ చిరుత ప్రవేశించింది.

విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది దానిని బంధించేందుకు అక్కడకు వచ్చారు. అంతలో ఒక పోలీస్‌పై చిరుత దాడి చేయడంతో స్వల్పంగా గాయపడ్డారు. మత్తు ఇంజక్షన్లు, వలలు ఉన్నప్పటికీ అటవీశాఖ, జూ సిబ్బంది దానిని బంధించలేకపోయారు. ఆ చిరుతను పట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోలీస్‌పై చిరుత దాడి చేసిన వీడియో ల్లో వైరల్‌ అయ్యింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Viral video : అదృష్టం అంటే ఇతనిదే.. పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు..

సాహో సాహసి.. మనుషులు తలుచుకంటే సాధించలేనిది ఏదిలేదని రుజువుచేసింది ఈ మహిళ