దిగ్గజ శాస్త్రీయ సంగీతకారుడు ఉస్తాద్ గులమ్ ముస్తాఫా ఖాన్ కన్నుమూత.. ప్రధాని సహా ప్రముఖుల సంతాపం

|

Jan 17, 2021 | 9:17 PM

దిగ్గజ భారతీయ శాస్త్రీయ సంగీతకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉస్తాద్ గులమ్ ముస్తాఫా ఖాన్(90) ఆదివారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.

దిగ్గజ శాస్త్రీయ సంగీతకారుడు ఉస్తాద్ గులమ్ ముస్తాఫా ఖాన్ కన్నుమూత.. ప్రధాని సహా ప్రముఖుల సంతాపం
Follow us on

దిగ్గజ భారతీయ శాస్త్రీయ సంగీతకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉస్తాద్ గులమ్ ముస్తాఫా ఖాన్(90) ఆదివారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ” ఉస్తాద్ గులమ్ ముస్తాఫా ఖాన్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన పాటలు తరతరాలకు గుర్తుంటాయి. ఆయనతో ముచ్చటించిన జ్ఞాపకాలు నాకు చాలానే ఉన్నాయి” అని మోదీ ట్వీట్ చేశారు. మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్, గాయని లతా మంగేష్కర్, విశాల్ దద్లానీ, అంజమ్ అలీ ఖాన్ తదితరులు కూడా ముస్తాఫా ఖాన్ మృతి పట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్​లోని బదాయున్​లో పుట్టిన ఉస్తాద్ గులమ్ ముస్తాఫా ఖాన్.. శాస్త్రీయ సంగీతకారుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించబడ్డారు.

Also Read: తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మాయం కేసులో క్లారిటీ.. ప్రైవేట్ ఆస్పత్రిలో మళ్లీ టెస్టులు.. ఏం తేలిందంటే