
కర్ణాటకలో ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ ఫైట్ మరింత హీటెక్కుతోంది. టాప్ లేడీ బ్యూరోక్రాట్లపై బదిలీ వేటు పడినా తాను తగ్గేది లేదంటోంది. ఐఏఎస్ అధికారి రోహిణీ సింధూరిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఐపీఎస్ అధికారి రూపా మౌద్గిల్. ఐఏఎస్ రోహిణీ సింధూరి అవినీతిపై మీడియా ద్రుష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో అనేకమంది జీవితాలు నాశనమయ్యేందుకు కారణమైన ఆ మహిళ అంటూ ఆరోపనలు చేశారు. అలాంటి మహిళను నిలదీయాల్సిందే అంటూ మరోసారి నోరు పారేసుకున్నారు. కర్ణాటకలో ఇప్పటికే ఒక ఐఏఎస్ , ఒక ఐపీఎస్ అధికారులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఐపీఎస్ అధికారుల జంట విడాకులు తీసుకుంది. నేను నా కుటుంబాన్ని కాపాడుకునేందుకే ఈ పోరాటం చేస్తున్నానంటూ ఈ యుద్ధం అంటూ సమర్థించుకున్నారు.
నేనూ నా భర్త ఇప్పటికీ కలిసే ఉన్నామని.. మా ఇద్దరి గురించి తప్పుడు ప్రచారం చేయొద్దన్నారు. నేను చాలా ధైర్యవంతమైన మహిళను.. మహిళా బాధితుల తరఫున పోరాటం చేస్తున్నాను. వివాదం వల్ల బదిలీ అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ ఫెట్టిన ఐపీఎస్ రూపా మౌద్గిల్. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ లు పెట్టొద్దని చీఫ్ సెక్రటరీ ఆదేశించినప్పటికీ పట్టించుకోని రూపా ముద్గల్.
ఇదిలావుంటే, కర్ణాటకలో ఐపీఎస్ అధికారిణి రూప మౌద్గిల్, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మధ్య జరుగుతున్న పోరులో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఇప్పుడు రోహిణి సింధూరి తన వ్యాఖ్య కోసం డి రూప మౌద్గిల్‌కి లీగల్ నోటీసు జారీ చేశారు. ‘పరువు పోగొట్టుకున్నందుకు, మానసిక వేదనకు’ బేషరతుగా లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పడంతో పాటు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రూప సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందర్భంలో ఆమె సింధూరి 19 ఆరోపణలు చేశారు. తోటి ఐఎఎస్ అధికారులతో తన స్వంత చిత్రాలను పంచుకుందని ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం