ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత భారత పర్యాటన రంగానికి మద్దతు వెల్లువెత్తుతోంది. మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవులుగా మారింది. ఈ వివాదం సోషల్ మీడియాలో తారాస్థాయికి చేరగా.. మాల్దీవుల ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదానికి ముఖ్యకారణం.. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల డిప్యూటీ మంత్రి మరియమ్ షివునా, ఎంపీ జహీద్ రమీజ్ చేసిన వ్యాఖ్యలే.. వారి వ్యాఖ్యల అనంతరం మాల్దీవులు వద్దు.. స్వదేశమే ముద్దు అంటూ భారతీయులందరూ.. లక్షద్వీప్ కు మద్దతుతెలుపుతున్నారు. అంతేకాకుండా.. దేశీయ పర్యాటకమే మేలని.. విదేశాల్లో కన్నా.. మన దేశంలోనే ఎక్కువ ప్రాంతాలున్నాయని.. వాటిని సందర్శించాలంటూ ప్రముఖులంతా ప్రజలను కోరుతున్నారు. గత వారం రోజుల నుంచి దేశీయ పర్యటక రంగానికి మద్దతు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కీలక ట్వీట్ చేశారు. సంస్కృతులు, ఖండాలకు అతీతంగా భారతదేశ పర్యాటక రంగం ముందుందని.. సోషల్ మీడియాలో దీన్ని హైలైట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్ లో ఓ సందేశాన్ని షేర్ చేశారు.
‘‘గత వారం రోజులుగా ప్రముఖులు, ప్రభావశీలులు, క్రీడల దిగ్గజాలు, మేధావులు నుంచి సామాన్య ప్రజల వరకు దేశీయ పర్యాటకానికి మద్దతు వెల్లువెత్తుతోంది. సంస్కృతులు, ఖండాలకు అతీతంగా ఉన్న అద్భుతమైన స్పందన భారతదేశ దేశీయ పర్యాటక రంగానికి ఉంది.. సోషల్ మీడియా, ముఖాముఖి చర్చలు దీనికి నిదర్శనం. దీన్ని హైలైట్ చేసినందుకు మీలో ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.
2019లో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఎర్రకోట నుంచి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇదే చెప్పారు.. ప్రతి భారతీయ పౌరుడు కనీసం 15 గమ్యస్థానాలను సందర్శించాలని ఉద్బోధించారు. కరోనా సమయంలో మీలో చాలా మంది పర్యాటక ప్రణాళికలను తగ్గించారు.. ఇప్పటికైనా “దేఖో అప్నా దేశ్” (మన దేశాన్ని చూడండి) ప్రయాణాన్ని ప్రారంభించాలని నేను ఆశిస్తున్నాను.’’ అంటూ కిషన్ రెడ్డి ఎక్స్ లో రాశారు.
Over the past week, there has been an outpouring of support for domestic tourism from celebrities, influencers, legends from sports, intellectuals and the common people.
The tremendous response transcending cultures and continents foreground both the potential of India’s… pic.twitter.com/yV9lrploHk
— G Kishan Reddy (@kishanreddybjp) January 11, 2024
అయితే, పొరుగు దేశాలతో టూరిజంపై వివిధ సోషల్ మీడియా చర్చలపై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. దౌత్యపరమైన మార్పులతో దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖులు, ప్రభావశీలులందరికీ కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలపడం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..