తమ్ముడికి ప్రేమతో అక్క రాసిన లేఖ.. పొడవు 434 మీటర్లు, ఇక బరువు ప్రపంచ రికార్డే!

|

Jun 27, 2022 | 7:19 PM

ఇన్ని పేజీల లేఖ రాయడం చాలా ఈజీగానే అయిపోయిందని... కానీ దాన్ని ఆ పేపర్లన్నీ ఒకదానితో ఒకటి అంటించటం మాత్రం తనకు పెద్ద సవాల్‌గా మారిందన్నారు. ఇక ఆ లేఖ పంపించడానికి కూడా తాను చాలా కష్టపడ్డానని చెప్పారు అక్క కృష్ణ ప్రియ.

తమ్ముడికి ప్రేమతో అక్క రాసిన లేఖ.. పొడవు 434 మీటర్లు, ఇక బరువు ప్రపంచ రికార్డే!
Long Letter
Follow us on

ఒకప్పుడు తమ క్షేమం కోసం ఒకరికొకరు ఉత్తరాలు రాసుకునేవారు. అలా రాసిన లేఖకు అవతలి వారి నుంచి వచ్చే సమాధానం కోసం ఆత్రుతగా ఎదురుచూడడం అలవాటుగా ఉండేది. కానీ నేటి యుగం హైటెక్‌గా మారింది. ఈరోజు మనం ఎవరినైనా గుర్తుకు తెచ్చుకుంటే వెంటనే మొబైల్ తీసుకుని ఆ వ్యక్తికి కాల్ లేదా మెసేజ్ చేస్తాం. వీలైతే, గంటల తరబడి మాట్లాడుకుంటాం.. కానీ, కేరళకు చెందిన ఓ అమ్మాయి ప్రపంచ సోదరుల దినోత్సవం సందర్భంగా తన తమ్ముడికి శుభాకాంక్షలు చెప్పడం మరిచిపోయింది. ఆ తర్వాత ఆమె పశ్చాతపడుతూ..తన తమ్ముడికి ఓ సుదీర్ఘ లేఖ రాసింది. తమ్ముడి క్షమించమని కోరుతూ..ఆ అక్క చేసిన పని ఇప్పుడు వరల్డ్‌ రికార్డ్ సృష్టించబోతోంది.

కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన కృష్ణప్రియ వృత్తిరీత్యా ఇంజనీర్. ఆమె ఈ సంవత్సరం ‘ప్రపంచ సోదరుల దినోత్సవం’ సందర్భంగా విద్యార్థిగా ఉన్న తన తమ్ముడితో లేదు. ఈ ప్రత్యేక సందర్భంలో అతనికి శుభాకాంక్షలు చెప్పడం మరచిపోయింది. కానీ, తమ్ముడు కృష్ణప్రసాద్‌ ఆమెకు మెసేజ్‌ పెట్టాడు. కానీ, ఆమె ఆ మెసేజ్‌ని చాలా సేపటి వరకు పట్టించుకోలేదు. తన సోదరి తనను విష్ చేయలేదని, తన మెసేజ్‌, ఫోన్స్‌కాల్స్‌ని పట్టించుకోలేదని కృష్ణప్రసాద్ మనస్తాపం చెందాడు. ఆ రోజు తనకు శుభాకాంక్షలు తెలిపిన ఇతరుల స్క్రీన్‌షాట్‌లను కూడా ఆమెకు పంపాడు కానీ ఏమైందో కానీ కృష్ణప్రియ వాటిని పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన అతడు ఆమెను వాట్సాప్‌లో కూడా బ్లాక్ చేశాడు. ఫోన్‌కి కూడా రియాక్ట్ కాలేదు. దీంతో అక్క కృష్ణ ప్రియ ఓ నిర్ణయం తీసుకుంది. తమ్ముడిని క్షమించమని కోరుతూ ఓ లెటర్ రాసింది. లెటర్‌ అంటే అంతా ఆషామాషీగా రాయలేదు. 434 మీటర్ల పొడవు.. 5 కిలోల బరువుతో తమ్ముడిని క్షమాపణ కోరుతూ లెటర్‌ పంపించింది.

కృష్ణప్రియ మే 25 నుంచి ఏ4 సైజు పేపర్‌పై లేఖలు రాయడం ప్రారంభించింది. అందుకోసం స్టేషనరీ షాపులో ఉన్న మొత్తం 15 లాంగ్ పేపర్ రోల్స్ కొనేసింది.. ఆపై ప్రతి రోల్‌ను 12 గంటల్లో పూర్తి చేయడం ప్రారంభించింది.
తమ్ముడు కృష్ణప్రసాద్‌కు అక్క కృష్ణ ప్రియ రాసిన లేఖలో ఏముంది అంటే…తన జీవితంలో అలాంటి సోదరుడు ఉన్నందుకు ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పడానికి పదాలు లేవు అని లేఖ ప్రారంభించింది కృష్ణప్రియ.. నిజంగా నేను చాలా లక్కీ..ఆ దేవుడు ఇచ్చి వరమే తమ్ముడని చెప్పుకొచ్చింది. తాము కలిసి ఆడిపాడిన ఆటపాటలు, తమ్ముడు పుట్టిన రోజు గురించి రాశారు. అతని మొదటి నడక, మొదటి భోజనం, పుట్టినరోజులను కలిసి ఎలా జరుపుకున్నారో వివరించింది.. అతని ప్రస్తుత జీవితం వరకు ఆహారంలో అదే ఇష్టాలు, అయిష్టాలు ఉన్నాయి. ఇలా అనేక వందల పేజీలు రాసేశారు.

ఇవి కూడా చదవండి

ఇన్ని పేజీల లేఖ రాయడం చాలా ఈజీగానే అయిపోయిందని… కానీ దాన్ని ఆ పేపర్లన్నీ ఒకదానితో ఒకటి అంటించటం మాత్రం తనకు పెద్ద సవాల్‌గా మారిందన్నారు. ఇక ఆ లేఖ పంపించడానికి కూడా తాను చాలా కష్టపడ్డానని చెప్పారు కృష్ణ ప్రియ. ఒక్కో రోల్‌ 30 మీటర్లు ఉండే రోల్స్‌పై ఈ లెటర్‌ రాసినట్టుగా చెప్పారు. మొత్తం 434 మీటర్లు ఉండే దాన్ని అతికంచడానికి చాలా సమయం పెట్టిందన్నారు. చివరకు ఎంతో కష్టపడి రోల్స్‌ అన్నింటినీ అతికించి ప్యాక్ చేసింది. “పోస్టాఫీసు వద్ద, దాని బరువు 5.27 కిలోలు తూగింది. పోస్టాఫీసు సిబ్బంది సైతం తను చెప్పిన విషయం తెలిసి తొలుత షాక్‌ అయినప్పటికీ, తరువాత సంతోషపడ్డారు. దీన్ని చూసి మీ తమ్ముడు కూడా ఆశ్చర్యపోతాడని చెప్పారు. తన తమ్ముడికి క్షమాణలు కోరుతూ ప్రియ రాసిన పొడవైన బరువైన లేఖ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ కోసం పంపించారు. వాళ్లు దాన్ని గుర్తించి నిర్దారించాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి