AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఇంట్లో 10 తులాల బంగారం చోరీ.. 2 రోజుల తర్వాత ఇంటి గేటు వద్ద ఓ మూట! ఏంటాని తెరచి చూడగా..

ఓ దొంగ గుట్టుగా ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. చోరీలో బాగానే ముట్టింది. ఏకంగా 10 తులాల బంగారం కనిపించడంతో అమాంతం నొక్కేసి.. మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే దొంగగారికి చెప్పలేనంత భయం వేసింది. ఒకవేళ పట్టుబడితే తన గతేంగానూ అనుకున్నాడు. అసలు ఆ ఆలోచన వస్తేనే గజగజ వణికిపోయాడు. వెంటనే కాజేసిన బంగానం అంతా దొంగతనం చేసిన ఇంటి గేటువద్ద వద్ద వదిలేసి ఇంటి యజమానిని క్షమాపణలు కోరుతూ ఓ లెటర్‌ కూడా పెట్టాడు. ఈ విచిత్ర ఘటన కేరళలోని త్రిస్సూర్‌లోని అరియన్నూర్‌లో గత శుక్రవారం (మే 8) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఆ ఇంట్లో 10 తులాల బంగారం చోరీ.. 2 రోజుల తర్వాత ఇంటి గేటు వద్ద ఓ మూట! ఏంటాని తెరచి చూడగా..
Kumaranellur Thief Returns Money After Selling Stolen Jewellery
Srilakshmi C
|

Updated on: May 13, 2026 | 8:22 PM

Share

గురువాయూర్, మే 13: అరియన్నూర్‌లో నివాసం ఉంటున్న పొక్కక్కిల్లత్ కుంజుముహమ్మద్ ఇంట్లో గత శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. పై అంతస్తులోని గదిలో ఉంచిన రెండు గాజులు, రెండు గొలుసులు, మూడు జతల చెవి కమ్మలు చోరీకి గురయ్యాయి. చోరీ సమయంలో పక్క గదిలో కుంజుముహమ్మద్ కుమార్తె బుష్రా పీకే, ఆమె భర్త అబూబక్కర్ ముహమ్మద్ రఫీ నిద్రపోతున్నారు. పై అంతస్తులోకి వెళ్లే తలుపు మూసి ఉండకపోవడంతో, దొంగ దాని ద్వారానే ఇంట్లోకి ప్రవేశించాడు. గదిలోకి ప్రవేశించిన తర్వాత దొంగ చేసిన దాదాపు అన్ని పనులను సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ దృశ్యాలలో అతని ముఖం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

గమనించని ఇంటి యజమాని తెల్లారి కూడా తన ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించలేదు. మరుసటి రోజు ఉదయం బుషారా తన కమ్మల కోసం అల్మారా తీయగా.. అందులో తన కమ్మలతోపాటు ఇతర బంగారం కూడా కనిపించలేదు. వెంటనే కుటుంబ సభ్యులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా దొంగతనం జరిగినట్లు గ్రహించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఇంట్లో వేలిముద్రలు ఇతర ఆధారాలను సేకరించారు. అయితే తాను

దొంగతనంకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో తాను పట్టుబడతానని భావించిన దొంగ.. దొంగిలించిన 10 తులాల్లో 8 తులాలు ఇంటి యజమాని గేటు లోపల ఓ కవరులో చుట్టి తీసుకువచ్చి భద్రంగా ఉంచాడు. దానితో పాటు అస్పష్టంగా అక్షర దోషాలతో నిండిన ఒక ఉత్తరం కూడా ఉంచాడు. సోమవారం ఉదయం ఆ కవరు విప్పిచూడగా ‘అయ్యా, నేను తప్పు చేశాను. క్షమించండి. నేను ఈ బంగారంలో 2 తులాలు తీసుకుని అమ్మేశాను. దయచేసి కేసును ఉపసంహరించుకోండి. క్షమించండి, క్షమించండి, క్షమించండి..’ అని ఆ ఉత్తరంలో రాశాడు. అంతేకాకుండా తాను అమ్మిన 2 తులాల బంగారాన్ని తిరిగి ఇస్తానని కూడా అందులో రాశాడు. ఇలా చోరీ చేసిన బంగారాన్ని తిరిగి ఇచ్చి క్షమాపణ చెప్పాడని పోలీసులు నిర్ధారించారు. ఇంటి బయట సీసీటీవీ లేకపోవడంతో, బంగారాన్ని లోపలికి తీసుకువస్తున్న దృశ్యాలు ఏవీ లభించలేదు. ఒక నెక్లెస్, ఒక జత చెవిపోగులు మినహా మిగిలిన బంగారు ఆభరణాలన్నీ తిరిగి ఇచ్చేసినట్లు బాధితులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
10 తులాల బంగారం చోరీ.. క్షమాపణలు చెప్పి తిరిగి ఇచ్చేసిన దొంగ!
10 తులాల బంగారం చోరీ.. క్షమాపణలు చెప్పి తిరిగి ఇచ్చేసిన దొంగ!
గంటలోపే గమ్యస్థానానికి.. భారత తొలి స్వదేశీ సెమీ హై-స్పీడ్ రైలు
గంటలోపే గమ్యస్థానానికి.. భారత తొలి స్వదేశీ సెమీ హై-స్పీడ్ రైలు
అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను..
అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను..
ఉచ్ఛస్థితిలో చంద్రుడు.. ఆ రాశుల వారికి కొత్త జీవితం పక్కా..!
ఉచ్ఛస్థితిలో చంద్రుడు.. ఆ రాశుల వారికి కొత్త జీవితం పక్కా..!
ఇది కదా శుభవార్త.. తల్లికి వందనం డబ్బుల జమకు ముహూర్తం ఫిక్స్!
ఇది కదా శుభవార్త.. తల్లికి వందనం డబ్బుల జమకు ముహూర్తం ఫిక్స్!
మా ప్లేయర్లను అంటే ఊరుకోం..ఫేక్ న్యూస్‌పై నిప్పులు చెరిగిన ప్రీతి
మా ప్లేయర్లను అంటే ఊరుకోం..ఫేక్ న్యూస్‌పై నిప్పులు చెరిగిన ప్రీతి
అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి అవతార్ 3.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి అవతార్ 3.. తెలుగులోనూ స్ట్రీమింగ్
రైలు టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో బుకింగ్‌కు ముందే తెలుసుకోవచ్చు
రైలు టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో బుకింగ్‌కు ముందే తెలుసుకోవచ్చు
ఇదెక్కడి రొమాంటిక్ సిరీస్ రా బాబు..!
ఇదెక్కడి రొమాంటిక్ సిరీస్ రా బాబు..!
అన్నం కంటే అదే బెటర్.. ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రివేళ చపాతీ తినండి
అన్నం కంటే అదే బెటర్.. ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రివేళ చపాతీ తినండి