భారీ వర్షాలకు కూలిన 151 ఏండ్ల పురాతన చర్చ్‌

భారీ వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల వరదల ధాటికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక ఇడుక్కిలో కొండ చరియలు విరిగిపడి.. పదుల సంఖ్యలో ప్రాణాలు..

భారీ వర్షాలకు కూలిన 151 ఏండ్ల పురాతన చర్చ్‌

Edited By:

Updated on: Aug 11, 2020 | 1:54 PM

భారీ వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల వరదల ధాటికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక ఇడుక్కిలో కొండ చరియలు విరిగిపడి.. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా.. ఈ వరదల ధాటికి ఓ పురాతన చర్చి కూలిపోయింది. అలప్పూజా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని చుంగం కురువెళ్లి పదశేఖరం ప్రాంతంలోని 151 ఏళ్ల సెయింట్ పాల్స్ సీఎస్ఐ చర్చ్ కుప్పకూలింది. ఈ సంఘటన మంగళవారం నాడు చోటుచేసుకుంది. భారీ వరదలకు చెరువు గట్టు తెగిపోవడంతో.. పొలాల మధ్య ఉన్న ఈ చర్చ్ కూలిపోయినట్లు స్థానికులు వెల్లడించారు. చర్చ్ సమీపంలో ఉన్న వారిని అధికారులు ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Read More :

దారుణం.. యూపీలో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

నా క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులకు కరోనా.. పుదుచ్చేరి సీఎం