Harassment: రెచ్చిపోయిన కీచకులు.. 15 ఏళ్ల బాలికను వేరు వేరు ప్రాంతాలు తిప్పుతూ..

|

Dec 27, 2021 | 11:59 PM

Harassment: కర్ణాటకలో దారుణం జరిగింది. మగ మృగాలు రెచ్చిపోయారు. ఓ మైనర్ బాలికపై దారుణ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఆరుగురు యువకులు అభం శుభం తెలియని

Harassment: రెచ్చిపోయిన కీచకులు.. 15 ఏళ్ల బాలికను వేరు వేరు ప్రాంతాలు తిప్పుతూ..
Arrest
Follow us on

Harassment: కర్ణాటకలో దారుణం జరిగింది. మగ మృగాలు రెచ్చిపోయారు. ఓ మైనర్ బాలికపై దారుణ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఆరుగురు యువకులు అభం శుభం తెలియని బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందతులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని ధార్వాడ్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధార్వాడ్ జిల్లాకు చెందిన మైనర్ బాలికకు అదే ప్రాంతానికి చెందిన ఓ కొందరు యువకులతో పరిచయం ఏర్పడింది. అయితే, కొన్నాళ్లపాటు వీరు ఆ అమ్మాయితో మంచిగా నటిస్తూ వచ్చారు. ఆ తరువాతే అసలు రంగు బయటపెట్టుకున్నారు. ఓ రోజు బయటకు తీసుకెళ్లి బలత్కారాం చేశారు. ఆ సమయంలో ఫోన్‌లో వీడియో చిత్రీకరించి ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంట్లో వారికి చెప్పినా చంపేస్తామంటూ హెచ్చరించారు. దాంతో భయపడిపోయిన బాలిక.. విషయాన్ని గుట్టుగా ఉంచుంది. మూడు నెలలుగా వీరి ఆగడాలకు అంతే లేకుండా పోవడం, వేరు వేరు ప్రాంతాలకు తీప్పుకుంటూ అత్యాచారానికి పాల్పడ్డారు. వీరి అరాచకానికి విసిగిపోయిన బాలిక.. ఇంట్లో తల్లిదండ్రలుకు తెలిపింది. దాంతో బాలికను తీసుకుని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులైన ఆరుగురు మైనర్ అబ్బాయిలను అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.

Also read:

Maoist vs Police: మావోయిస్టులపై పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారా? ఆ హత్యకు, ఎన్‌కౌంటర్‌కు సంబంధం ఉందా?

Vangaveeti Radha: వంగవీటి రాధాకు 2+2 సెక్యూరిటీ.. ఇంటెలిజెన్స్‌ డీజీకి సీఎం ఆదేశం..

Viral Video: ఎలుగుబంటి తెలివితేటలకు నెటిజన్లు ఫిదా.. రోడ్ సేఫ్టీపై వైరల్ వీడియో..