Pubg Effect: ఆన్‌లైన్ గేమ్స్ కుటుంబాలను కూల్చేస్తున్నాయి. లోకజ్ఞానమే తెలియని పిల్లలు.. ఆ ఆటల మోజులో పడి ఇళ్లును గుల్ల చేస్తున్నారు. సైబర్ మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకుని అందినకాడికి దోచిపెడుతున్నారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలుగా మారి.. సొంత ఇంట్లోనే దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇద్దరు పిల్లలు.. తమ తల్లికి తెలియకుండా ఆమె ఖాతా నుంచి లక్ష రూపాయలకు పైగా విత్ డ్రా చేసుకున్నారు. అది తెలియక ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో అసలు విషయం తెలిసి ఖంగుతిన్నది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళితే.. కోజికోడ్‌కు చెందిన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళ భర్త విదేశాల్లో ఉంటున్నాడు. ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి కోజికోడ్‌లోనే నివాసం ఉంటోంది. ఇద్దరూ పిల్లల్లో ఒకరు తొమ్మిదో తరగతి చదువుతుండగా.. మరొకరు పదవ తరగతి చదువుతున్నారు. కరోనా కారణంగా వారికి ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. దాంతో ఆ తల్లి.. తన పిల్లలిద్దరికీ స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ ఇచ్చింది. కానీ, ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డ పిల్లలు.. నిరంతరం గేమ్స్ ఆడుతుండేవారు. ముఖ్యంగా నిషేధిత ‘పబ్‌జి’ ఆటకు అడిక్ట్ అయ్యారు ఆ పిల్లలిద్దరు. ఆటలో భాగంగా నెక్ట్స్ లెవల్‌కి చేరడానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆ పిల్లలు తమ తల్లి ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్, ఇతర వివరాలు తెలుసుకున్నారు. అలా.. ఆమె ఖాతా నుంచి పలు దాఫాలుగా లక్ష రూపాయలకు పైగా డబ్బులు డ్రా చేశారు.
ఇది తెలియని ఆ తల్లి డబ్బులు పోయాయనుకుని కోజికోడ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆమె పిల్లలే ఆ డబ్బులు విత్ డ్రా చేసినట్లు గుర్తించారు. పబ్‌జి కోసం వారు ఈ డబ్బును పే చేసినట్లు గుర్తించారు. విషయాన్ని బాధితురాలికి తెలియజేశారు. అది తెలిసి ఆవిడ కూడా షాక్ అయ్యారు.
Also read:
Huzurabad By Election: హుజారాబాద్‌లో ఈటెల రాజేందర్‌దే గెలుపు.. సంచలన కామెంట్స్ చేసిన బండి సంజయ్..
V Hanumantha Rao: ఆ విషయాలపై ఇప్పుడేం మాట్లాడను.. క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత..