గోల్డ్ స్మగ్లింగ్ కేసులో స్వప్న, సందీప్‌లకు ఆగస్టు 21 వరకు రిమాండ్

| Edited By: Pardhasaradhi Peri

Aug 02, 2020 | 2:30 PM

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితులు స్వప్న  సురేష్,సందీప్ నాయర్ లకు కోర్టు ఈ నెల 21 వరకు జుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది.

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో స్వప్న, సందీప్‌లకు ఆగస్టు 21 వరకు రిమాండ్
Follow us on

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితులు స్వప్న  సురేష్,సందీప్ నాయర్ లకు కోర్టు ఈ నెల 21 వరకు జుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. కొచ్చి లోని మేజిస్ట్రేట్ నివాసంలో పోలీసులు వీరిని శనివారం హాజరు పరిచారు. ఆయన ఆదేశాలతో ఇక వీరిని ఎర్నాకుళం జైలుకు తరలించనున్నారు. వీరిని తమ కస్టడీలోకి తీసుకున్నకస్టమ్స్ శాఖ నాలుగు రోజులపాటు విచారించింది. స్వప్న ఓ చార్టర్డ్ అకౌంటెంటుతో ఓ బ్యాంకు లాకర్ ని షేర్ చేసుకునేదని విచారణలో తేలింది. అతనికి ఉన్నత స్థానాలతో ఉన్న వ్యక్తులతో లింక్ ఉన్నట్టు కనుగొన్నారు. అసలు బంగారం దొంగ రవాణాకు దౌత్యపరమైన హోదాను అడ్డు పెట్టుకోవాలని సరిత్, రమీస్ అనే వ్యక్తులు వీరికి సలహా ఇచ్చారట. కాగా వీరిద్దరిని తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ రేపు కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.