కేరళలో ఏనుగు దారుణ మరణం.. బాలీవుడ్ సెలబ్రిటీల విచారం

కేరళ లోని మళప్పురంలో క్రాకర్స్ తో కూడిన పైన్  యాపిల్ తిని ఏనుగు మరణించిన ఉదంతం బాలీవుడ్ సెలబ్రిటీలను కదిలించింది. గర్భంతో ఉన్న గజరాజు పట్ల జరిగిన ఈ  కిరాతకాన్ని..

కేరళలో ఏనుగు దారుణ మరణం.. బాలీవుడ్ సెలబ్రిటీల విచారం

Edited By:

Updated on: Jun 03, 2020 | 3:40 PM

కేరళ లోని మళప్పురంలో క్రాకర్స్ తో కూడిన పైన్  యాపిల్ తిని ఏనుగు మరణించిన ఉదంతం బాలీవుడ్ సెలబ్రిటీలను కదిలించింది. గర్భంతో ఉన్న గజరాజు పట్ల జరిగిన ఈ  కిరాతకాన్ని అనుష్క శర్మ, శ్రధ్ధా కపూర్, రణ దీప్ హుడా, దిశా పటానీ, అలియా భట్ వంటివారు ఖండిస్తూ ట్వీట్లు చేశారు. జంతు హింసకు పాల్పడినవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అందువల్లే ఎనిమల్ క్రూయల్టీకి వ్యతిరేకంగా తీవ్రమైన శిక్షలు పడేలా చట్టాలు తేవాలని వారు  అభ్యర్థించారు. రణ దీప్  హుడా ఏకంగా తన ట్వీట్ లో.. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కు ఇదే విధమైన విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన తనను ఎంతో కలచివేసిందని శ్రధ్ధా కపూర్ పేర్కొన్నారు. ఇది మూగ జీవిపై అమానుషమైన ‘జోక్’ అని అలియా భట్ విచారం వ్యక్తం చేసింది.