ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కేరళ దంపతులు.. దోసె పిండి వ్యాపారంతో ఎందరికో ఉద్యోగాలిస్తున్న ఇంజినీయర్స్..

|

Nov 20, 2022 | 5:47 PM

ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడి తిండికి అలవాటు పడలేకపోయారు.. ఈ జంట ఉంటున్న ప్రాంతంలో దక్షిణ భారత ప్రసిద్ధ బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ , వడా సాంబర్ వంటి వంటకాలు ఎక్కడా లభించలేదు. డచ్ దేశంలో రుచికరమైన భారతీయ స్నాక్స్ అందుబాటులో లేవని గ్రహించిన రమ్య..

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కేరళ దంపతులు.. దోసె పిండి వ్యాపారంతో ఎందరికో ఉద్యోగాలిస్తున్న ఇంజినీయర్స్..
Kerala Couples
Follow us on

జీవనోపాధి కోసం నెదర్లాండ్స్‌కు వెళ్లిన కేరళకు చెందిన దంపతులు ఓ గొప్ప ఉపాయం చేశారు. అక్కడి వారి అవసరాలను ఆసరగా చేసుకుని విజయవంతంగా వ్యాపారం ప్రారంభించారు. ఒకప్పుడు వారు పని కోసం అందిరినీ అడుక్కునేవారు.. కానీ, నేడు చాలా మందికి ఉపాధి కల్పించారు. అవును కేరళకు చెందిన రమ్య, నవీన్ అనే ఇంజినీర్ దంపతులు 11 ఏళ్ల క్రితం నెదర్లాండ్స్ వెళ్లారు. ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడి తిండికి అలవాటు పడలేకపోయారు.. ఈ జంట ఉంటున్న ప్రాంతంలో దక్షిణ భారత ప్రసిద్ధ బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ , వడా సాంబర్ వంటి వంటకాలు ఎక్కడా లభించలేదు. డచ్ దేశంలో రుచికరమైన భారతీయ స్నాక్స్ అందుబాటులో లేవని గ్రహించిన రమ్య తన సొంత వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనతో ఓ అడుగు ముందుకు వేసింది.. అందుకు తగ్గట్టుగానే “మదర్స్ కిచెన్” అనే చిన్న కంపెనీని ప్రారంభించారు..

మదర్స్‌ కిచెన్‌ ద్వారా మొదట్లో 10 కిలోల దోసె పిండిని మెత్తగా చేసి అక్కడి హోటళ్లకు ఇచ్చేవారు. ఆ తర్వాత డిమాండ్ మేరకు ఈ మొత్తాన్ని పెంచి ప్రస్తుతం 500 కిలోల దోస పిండిని రుబ్బి సూపర్ మార్కెట్లకు విక్రయిస్తున్నారు. కేవలం దంపతులు ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పుడు ఎదిగి ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తోంది. దోస పిండికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పెద్ద పెద్ద యంత్రాలను కొనుగోలు చేశారు.

ఇంజనీర్లుగా ఉన్న రమ్య, నవీన్‌లు ఈ వెంచర్‌ కోసం ఉద్యోగాన్ని వదులుకున్నారు. వ్యాపారం ప్రారంభించిన మొదట్లో రమ్య మాత్రమే మొత్తం చూసుకునేంది. కానీ, వ్యాపారం విస్తరించిన తర్వాత నవీన్ కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. పూర్తిగా దోసె పిండి బిజినెస్‌పై టైమ్‌ కేటాయించారు. డచ్ దేశంలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన ఈ జంట.. కేరళలో కూడా కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి