
మరికాసేపట్లో పెళ్లి.. అటు వరుడు.. ఇటు వధువు ఇద్దరూ రెడీ అవుతున్నారు.. ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి నెలకొంది.. ఈ క్రమంలోనే.. వధువు మేకప్ చేయించుకునేందుకు వెళ్లింది.. సరిగ్గా.. అదే సమయంలో వధువును కారును ఢీకొట్టింది.. దీంతో ఆమెకు గాయలయ్యాయి. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.. అయితే.. వధువు పరిస్థితి బాలేకపోయినా.. సరిగ్గా అదే మూహుర్తానికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించి.. వివాహాన్ని జరిపించారు. ఈ ఘటన కేరళలోని అలప్పుజలో చోటుచేసుకుంది.. వధువు కారు ప్రమాదంలో గాయపడగా.. ఆసుపత్రికి చేరుకున్న ఇరు కుటుంబాలు.. అక్కడే వివాహం జరిపించారు. తుంబోలికి చెందిన షారన్ – అవని ఆసుపత్రిలో వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
తన పెళ్లికి ముందు మేకప్ చేయించుకోవడానికి వెళ్తుండగా వధువు అవని ప్రయాణిస్తున్న వహనాన్ని కారు ఢీకొట్టింది. గాయపడిన అవనిని కొచ్చి లేక్ షోర్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వధూవరుల బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. తరువాత, పెద్ద ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలియజేయడంతో, బంధువులు ఈరోజే వివాహం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
దీంతో సరైన సమయంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఇద్దరి వివాహానికి దగ్గరి బంధువులు, ఆసుపత్రిలో వైద్యులు హాజరయ్యారు. ఈ వివాహం ఈరోజు మధ్యాహ్నం 12.12 నుంచి 12.25 గంటల మధ్య జరగాల్సి ఉంది. ఇంతలో, వధువు కారు ప్రమాదంలో గాయపడింది. తన్నీర్ముక్కం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వధువు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
ఆ తర్వాత, ఆమెను మొదట కొట్టాయం మెడికల్ కాలేజీలో, తరువాత కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. వివాహం అలప్పుజ శక్తి ఆడిటోరియంలో జరగాల్సి ఉంది. అవని వెన్నెముకకు గాయం అయింది. అంతేకాకుండా ఆమెకు కాలు ఎముక కూడా విరిగింది. రేపు శస్త్రచికిత్స జరుగుతుంది. అవనితో పాటు ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడ్డారు. వారు వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. ఇంతలో, వివాహ మండపానికి వచ్చిన వారికి భోజనాలు పెట్టి పంపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..