Salary for Housewives: షార్జాలో ఉద్యోగుల భార్యలకూ జీతాలు.. భారత సుప్రీం కోర్టే ఆదర్శమట..!

Salary for Housewives: కొవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి.

Salary for Housewives: షార్జాలో ఉద్యోగుల భార్యలకూ జీతాలు.. భారత సుప్రీం కోర్టే ఆదర్శమట..!

Updated on: Feb 04, 2021 | 6:00 AM

Salary for Housewives: కొవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. మరికొన్ని సంస్థలయితే ఏకంగా ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని సంస్థలు తాత్కాలిక ఉద్యోగుల ఆపివేసి.. కొన్ని నెలల తరువాత తిరిగి తీసుకున్నారు. కానీ, ఇక్కడ మాత్రం ఓ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంతో పాటు, వారి భార్యలకూ(గృహిణిలకు) జీతాలు ఇస్తున్నారు. అదేమంటే.. కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగులు చూపిన అసాధారణ నిబద్ధతే తనను అలా ప్రేరేపించిందని సంస్థ యజమాని చెప్పుకొస్తున్నాడు. ఇంతకీ ఎవరా యజమాని, ఎక్కడి సంస్థ అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్‌లోని కేరళ ప్రాంతానికి చెందిన సోహన్ రాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో స్థిరపడ్డారు. షార్జాలో మేషం గ్రూప్ సంస్థలను నెలకొల్పి పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగాడు. అయితే కోవిడ్ మహమ్మారి సమయంలో సంస్థలోని ఉద్యోగులు ఏమాత్రం కరోనాకు భయపడకుండా సంస్థ అభివృద్ధికి మరింత కృషి చేశారు. దానికి రాయ్ ఫిదా అయిపోయారు. ఉద్యోగుల ఇంత ధైర్యంగా పని చేయడానికి వారి జీవత భాగస్వాములు కూడా ఒక కారణం భావించారు. వారికి కూడా గుర్తింపునివ్వాలని భావించారు. ఇంకేముందు.. ఉద్యోగుల భార్యలకూ జీతాలు ఇవ్వడం ప్రారంభించారు.

అయితే, ఉద్యోగుల భార్యలకూ జీతాలు ఇవ్వడానికి ప్రధాన కారణం భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే అని చెబుతాడు రాయ్. ఓ గృహిణి చేసే పని విలువ ఆమె భర్త కంటే తక్కువ ఏం కాదంటూ ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పుని ఆదర్శంగా తీసుకున్న రాయ్.. ఉద్యోగుల జీవిత భాగస్వాములకు అండగా నిలవాలని డిసైడ్ అయ్యాడు. కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగులు మరింత నిబద్ధతతో పని చేయడానికి వారి జీవిత భాగస్వాములు కూడా కారణం అని తలిచారు. అందులో భాగంగానే.. తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాముల వివరాలను సేకరించి వారి అకౌంట్‌లో నెల నెలా జీతాలు వేస్తున్నారు. ఇదిలాఉంటే.. మేషం సంస్థలో మూడేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్ కూడా ఇస్తోంది. ఉద్యోగుల పట్ల మేషం గ్రూప్ చూపించే శ్రద్ధ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Also read:

october 1st: ఊరు, పేరు లేని సినిమా మరెవరిదో కాదు… అసలు విషయాన్ని వెల్లడించిన చిత్ర యూనిట్.

Cancer Day: ఆహారంతో క్యాన్సర్‌ మహమ్మారికి అడ్డుకట్టవేయొచ్చని మీకు తెలుసా..? వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే..