Akshaya Tritiya: కర్ణాటకలో మరో వివాదం.. వారి షాపుల్లో బంగారు ఆభరణాలు కొనొద్దంటూ..

|

Apr 25, 2022 | 3:50 PM

Akshaya Tritiya: కర్ణాటకలో (Karnataka) మరో వివాదం తెరమీదకు వచ్చింది. రాష్ట్రంలో ముస్లింలు( Muslims) నిర్వహించే బంగారు దుకాణాల నుంచి హిందువులు బంగారం కొనుగోలు చేయవద్దని..

Akshaya Tritiya: కర్ణాటకలో మరో వివాదం.. వారి షాపుల్లో బంగారు ఆభరణాలు కొనొద్దంటూ..
Akshaya Tritiya
Follow us on

Akshaya Tritiya: కర్ణాటకలో (Karnataka) మరో వివాదం తెరమీదకు వచ్చింది. రాష్ట్రంలో ముస్లింలు( Muslims) నిర్వహించే బంగారు దుకాణాల నుంచి హిందువులు బంగారం కొనుగోలు చేయవద్దని హిందువులను కోరుతున్నారు. ముస్లింలు ఇక్కడ డబ్బు సంపాదించి.. అదే డబ్బుతో హిందువులపై దాడులు చేస్తున్నారని.. రోజు రోజుకీ హిందువుల పరిస్థితి మరింత దిగజారుతుందని రైట్ వింగ్ గ్రూపులు పేర్కొన్నాయి. హిందువులపై దాడులు జరుగుతున్నాయని, లవ్ జిహాద్ జరుగుతోందని, 12,000 మందికి పైగా బాలికలను ఇస్లాంలోకి మార్చారని శ్రీరామసేన అధినేత ప్రమోద్ ముతాల్ ముతాలిక్ పేర్కొన్నారు. ఆభరణాల దుకాణాల్లో ఎక్కువ భాగం కేరళకు చెందిన ముస్లింలకు చెందినవి. కనుక ముస్లింలకు చెందిన గోల్డ్ షాప్స్ లో బంగారు, వెండి వస్తువులను హిందువులు కొనుగోలు చేయవద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

కేరళలో 800 మంది హిందువుల హత్య చేయబడ్డారు. ఆభరణాలు కొనడానికి మనం ఖర్చు చేసే డబ్బు మొత్తం కేరళలోని ముస్లిం సంస్థలకు వెళుతుంది. వారు మళ్ళీ అదే డబ్బుతో హిందువులు చంపబడుతున్నారు” అని ప్రమోద్ ముతాల్  ఆరోపించారు. ముస్లింల దుకాణాల నుంచి భరణాలను కొనుగోలు చేయడం ద్వారా, మనం మనకు మరింత దిగజారుతున్నామని చెప్పారు. హిందువులు. హిందువుల షాపుల నుంచి ఆభరణాల నుండి మాత్రమే కొనుగోలు చేయాలని తాము ప్రజలను కోరుతున్నామని చెప్పారు. ఈ రోజు (రైట్‌వింగ్‌లు) ప్రారంభించిన ఉద్యమానికి నేను హృదయపూర్వకంగా తాను మద్దతును అందిస్తున్నాను,” చెప్పారు  శ్రీరామసేన అధినేత ప్రమోద్ ముతాల్.

ఈ నెల ప్రారంభంలో, మంగళూరులోని చాముండి కొండలపై ఉన్న హిందూ దేవాలయాల దగ్గర హిందూయేతర వ్యాపారులను నిషేధించాలని పిలుపునిచ్చింది. అంతేకాదు హలాల్ మాంసాన్ని కొనుగోలు చేయవద్దంటూ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.  హిందూ దేవాలయాలు, ఉత్సవాలు, జాతర్లు,  మతపరమైన కార్యక్రమాల సమయంలో హిందూయేతర వ్యాపారులు, విక్రేతలకు వ్యాపారాన్ని నిర్వహించడానికి అనుమతి ఇవ్వకూడదని కోరుతున్నారు.

Also Read: Prashant Kishor: కాంగ్రెస్ పార్టీలో పీకే చేరికపై తర్జనభర్జనలు.. సోనియా నివాసంలో సీనియర్ నేతల కమిటీ మంతనాలు

Success Story: ఫలితవివ్వని ఉద్యోగ వేట.. రూ.30వేల పెట్టుబడితో జీవితాన్ని అందంగా మలుచుకున్న ఆదర్శ యువతి