Watch Video: ప్రధాని మోదీ ఉప్పొంగిన అభిమానం.. కటౌట్ చూసి ఈ పెద్దాయన ఏం చేశాడంటే..

Karnataka: త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర నాయకులంతా పార్టీ ప్రచారాలలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులోని దేవనహళ్లిలో బీజేపీ రోడ్‌షో నిర్వహించింది. అయితే వేలాది..

Watch Video: ప్రధాని మోదీ ఉప్పొంగిన అభిమానం.. కటౌట్ చూసి ఈ పెద్దాయన ఏం చేశాడంటే..
Man Wipes Pm Modi's Cutout

Updated on: Apr 22, 2023 | 8:03 AM

Karnataka: త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర నాయకులంతా పార్టీ ప్రచారాలలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులోని దేవనహళ్లిలో బీజేపీ రోడ్‌షో నిర్వహించింది. అయితే వేలాది మంది బీజేపీ నాయకులు, కార్యకర్తల నడుమ జరిగిన ఈ సభకు వచ్చిన ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు జాతీయ హోంమంత్రి అమిత్ షాతో బీజేపీలోని ఇతర అగ్రనాయకుల దృష్టిని ఆకర్షించింది. అసలు అతను ఏం చేశాడంటే.. దేవనహళ్లి వేదికగా శుక్రవారం జరుగుతున్న సభ సమీపంలో వర్షం పడింది. ఈ సమయంలో అక్కడే రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్‌పై కూడా వర్షం పడింది. దీన్ని గమనించిన సదరు వ్యక్తి తన తలపై ఉన్న కండువా(టవల్)తో మోదీ కటౌట్‌ని తుడిచాడు.

అయితే అక్కడే ఉండి వీడియో షూట్ చేసిన వ్యక్తి అతని దగ్గరకు వచ్చి ‘డబ్బు కోసం చేస్తున్నావా..?’ అని అడగగా, ఆ వ్యక్తి  ‘నాకు డబ్బు అవసరం లేదు. నేను ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోను. ఆయన (ప్రధాని మోదీ)పై నాకున్న ప్రేమ, నమ్మకం వల్లే నేను ఇలా చేస్తున్నాను’ అని సమాధానమిచ్చాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు అటు బీజేపీ అగ్ర నాయకులను, నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీనిపై జాతీయ హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ అమిత్ షా ఇలా రాసుకొచ్చారు. ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఉన్న అచంచలమైన విశ్వాసం, ఆయన పట్ల ఉన్న నిస్వార్థ ఆప్యాయతను బీజేపీ సంపాదించినది. అదే బీజేపీక బలానికి మూలం. కర్ణాటకలోని దేవనహళ్లి నుంచి వచ్చిన ఈ అందమైన వీడియోను చూడండి’ అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే ‘దేశ ప్రజలు మోదీని తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నార’ని కర్ణాటక బీజేపీ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. ఇంకా ‘భారత ప్రధాని నరేంద్రమోదీ అడుగు జాడల్లో నడిచేవారు, ఆయన్ను ఎంతగానో ఆరాధించేవారు దేశంలో కోట్లాది సంఖ్యలో ఉన్నార’నడానికి ఇదే తార్కాణమంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..